Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Half Lion P V Narasimha Rao Biopic Announced

Half Lion: పాన్ ఇండియా సిరీస్ గా భారతరత్న పి.వి. నరసింహ రావు బయోపిక్..

Published Date :February 28, 2024 , 9:06 pm
By Roja Pantham
Half Lion: పాన్ ఇండియా సిరీస్ గా భారతరత్న పి.వి. నరసింహ రావు బయోపిక్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Half Lion: ఓటిటీలో నెంబర్ 1 స్థానం సంపాదించడానికి ఆహా చాలా కష్టపడుతుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ కు గట్టి పోటీని ఇస్తుంది. సినిమాలు, సిరీస్ లే కాకుండా సింగింగ్, డ్యాన్స్, కుకరీ షోస్ తో పాటు కామెడీ షోస్ తో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తుంది. ఇక తాజాగా ఆహా… ఒక అద్భుతమైన పాన్ ఇండియా సిరీస్ కు పునాది వేసింది. మాజీ భారత ప్రధాని పి.వి.నరసింహ రావు బయోపిక్ ను పాన్ ఇండియా సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మాజీ భారత ప్రధాని పి.వి. నరసింహ రావు గారికి ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. 1991 నుంచి 1996 వరకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించింది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కొత్తపుంతలు తొక్కించటంలో ఆయనెంతో కీలకంగా వ్యవహరించారు. ఇక ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి ప్రేక్షకులు తెలుసుకోవడానికి.. ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ తో కలిసి భారతరత్నఅవార్డు గ్రహీత పి.వి.నరసింహారావు బయోపిక్ హాఫ్ లయన్ పేరుతో తెరకెక్కించనుంది. పలు భాషలలో రూపొందుతున్నఈ బయోపిక్ పి.వి.నరసింహారావు జీవిత చరిత్రను వివరిస్తుంది. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన హాఫ్ లయన్ పుస్తకం ఆధారంగా.. జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రకాష్ ఝా ఈ సిరీస్‌కు రూపోందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియాన్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సిరీస్ కు సంబందించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. మరి ఈ సిరీస్ తో ఆహా ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aha video
  • half lion
  • P.V. Narasimha Rao Biopic
  • Tollywood News

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 7, మంగళవారం దినఫలాలు..

  • Donald Trump: ఇరాన్‌ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions