Nani- Mrunal: నాచురల్ స్టార్ నాని దసరా లాంటి భారీ హిట్ తర్వాత జోరు పెంచిన విషయం తెలిసిందే ప్రస్తుతం నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి హాయ్ నాన్న. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే హాయ్ నాన్న చిత్రం నుంచి సమయమా అంటూ సాగే ఒక సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఖుషీ సినిమాతో తెలుగులో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న హేషమ్ అబ్దుల్ వాహమ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఫ్రెష్ ఫీల్ కలిగిందని అభిమానులు కామెంట్స్ పెడుతూ వచ్చారు. అంతేకాకుండా ఈ సాంగ్ కు చాలామంది ఫిదా అయినట్లు కూడా తెలిపారు.
Jagapathi Babu: వయసు పెరిగినా వన్నె తగ్గని అందగాడు
అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణ కుమార్ ఈ సాంగ్ ను ఆలపించారు. ఇక తాజాగా ఈ సాంగ్ కు నాని, మృణాల్ స్టెప్పులు వేసి అలరించారు. ఇద్దరు వైట్ కలర్ డ్రెస్సులు వేసుకొని క్యూట్ స్టెప్స్ తో అలరించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. అబ్బబ్బ.. ఈ జంట ఎంత ముద్దుగా ఉన్నారు అని కొందరు.. ఈ జంట కూడా సీతారామం జంటలా ఫేమస్ అవుతారేమో అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో నాని, మృణాల్ జంట మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.