Jagapathi Babu:విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళలకు దగ్గరైన ఈ హీరో ప్రస్తుతం విలన్ గా, సపోర్టివ్ రోల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే జగపతిబాబు ఉండడం కామన్ గా మారిపోయింది. మొదటి నుంచి కూడా జగపతిబాబుకి ముక్కు సూటితనం ఎక్కువ. మనసులో ఏది అనిపిస్తే అది నిర్మోహమాటంగా ముఖం మీద చెప్పేస్తాడు. దీనివల్ల ఆయన ఎన్నో వివాదాలను, అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో చెప్కొచ్చాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో జగపతిబాబు నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఉంటాడు. తనకు నచ్చిన వంటలు, విదేశాల్లో తిరిగిన వీధులు, తన ఫ్యాషన్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా తనకు సంబంధించిన ఫోటోషూట్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంటూ కలర్ కాంబినేషన్ గురించి తనదైన రీతిలో మాట్లాడుతూ ఉంటాడు.
Mansion 24: ఓంకార్ అన్నయ్య.. ప్యాంట్ తడిచేలా భయపెడతాడంట..?
తాజాగా జగపతిబాబు ఒక ఫోటోను షేర్ చేశాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో జగ్గు భాయ్ మెరిసిపోయాడు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో హీరోలాగా కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫొటోకు క్యాప్షన్ గా “ఏ క్యాప్షన్ పెట్టాలో అర్థం కాలేదు. నా శ్రేయోభిలాషులు మీరే. కాబట్టి.. మీరే పెట్టండి.. ఎదురు చూస్తూ ఉంటాను” అంటూ రాసుకోచ్చాడు. ఇక ఈ ఫోటోకు అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. డ్యాషింగ్ లుక్ అని కొందరు, లుకింగ్ యంగ్ సార్ అని ఇంకొందరు.. వయసు పెరిగినా వన్నె తగ్గని అందగాడు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం జగ్గుభాయ్ నటిస్తున్న సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న సలార్ ఒకటి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వమని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో జగ్గూభాయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.