మమ్ముట్టీ, అజిత్, శివన్న, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు వాళ్ల వాళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్. ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ఈ హీరోలు మాత్రం రీజనల్ మార్కెట్ కే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు. ఎంత రీజనల్ మార్కెట్ ని స్టిక్ అయినా కూడా ఈ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే పాన్ ఇండియా రికార్డులు కూడా బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి హీరోల్లో మహేష్ బాబు కూడా ఉన్నాడు. కింగ్ నాగ్ రీజనల్ బాక్సాఫీస్ గా పేరున్న మహేష్ బాబు, ఇండియాలోని అన్ని రీజనల్ సెంటర్స్ లో ఉన్న రికార్డ్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ నే రాబడుతూ ఉంటాడు. బాహుబలి రికార్డ్స్-నాన్ బాహుబలి రికార్డ్స్ అనే పదం మొదలయ్యిందే మహేష్ బాబు నుంచి… ఇలాంటి మహేష్ బాబు ఇప్పుడు తన చివరి రీజనల్ సినిమాతో బాక్సాఫీస్ ముందుకి రాబోతున్నాడు.
త్రివిక్రమ్ తో కలిసి గుంటూ కారం సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఇదే మహేష్ నుంచి రాబోతున్న లాస్ట్ రీజనల్ సినిమా, ఈ మూవీ తర్వాత మహేష్ పాన్ ఇండియా-పాన్ వరల్డ్ మర్కెట్స్ ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. గుంటూరు కారం సినిమా సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాతో మహేష్ రీజనల్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ. గుంటూరు కారం సినిమాతో అన్ని సెంటర్స్ లో రాజమౌళి సినిమా బాక్సాఫీస్ లెక్కలకి దగ్గరగా ఉంటామని నాగ వంశీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే హ్యూజ్ నంబర్ ఆఫ్ థియేటర్స్ ని కూడా గుంటూరు కారం సినిమాకి కేటాయిస్తున్నారు. జనవరి 12న గుంటూరు కారం సినిమా నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేయబోతుంది. ఇక్కడి నుంచి బాబు పాన్ ఇండియా ఆగమనం మొదలవుతుంది.