Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అవుతుంది. సంక్రాంతి పోటీల్లో గుంటూరు కారంపైనే ఎక్కువ హైప్ ఉంది. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరు మీద ఉన్నాయి.
ఇక మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ టైమ్ సెట్ చేశారు. ట్రైలర్ ఈవెంట్ ను .. ప్రీ రిలీజ్ ఈవెంట్ గా మార్చేశారు. టైమ్ తక్కువ ఉండడంతో ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6 న జరగనుంది. హైదరాబాద్ లోనే గ్రాండ్ గా ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇక దీంతో మహేష్ ఫ్యాన్స్ ట్రైలర్ కోసం రెడీ అవుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ చేయడానికి ఫ్లెక్సీలు రెడీ చేసుకుంటున్నారు. మరి అన్ని సినిమాలతో పోటీ పడి మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.