గత అయిదారు ఏళ్లగా కూల్ అండ్ క్లాస్ రోల్స్ మాత్రమే చేస్తున్న మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. జనవరి 12న రిలీజ్ డేట్ టార్గెట్ మిస్ అవ్వకూడదని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ బయటకి వస్తుందని ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఒక్క సాంగ్ బయటకి వస్తే గుంటూరు కారం గురించి వచ్చే నెగటివ్ కామెంట్స్ అన్నీ ఎండ్ అవుతాయి. వాస్తవానికి మహేష్ బర్త్ డే, ఆగస్టు 15, వినాయక చవితి… ఇలా ప్రతి పండక్కి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారు అనే మాట వినిపిస్తూనే ఉంది. థమన్ సాంగ్ కూడా రెడీ చేసాడన్నారు కానీ పాట మాత్రం బయటకి రాలేదు. దసరా వరకూ ఎన్ని అకేషన్స్ అయిపోయినా కూడా సాంగ్ మాత్రం బయటకి రాలేదు.
లాస్ట్ కి దీపావళికి సాంగ్ ని రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం… గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ దీపావళి పండగ తర్వాతే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సాంగ్ రెడీ కానీ బయటకి వదలాలి అంటే లిరికల్ వీడియోలో సినిమా ఫుటేజ్ వాడాలి, సాంగ్ షూట్ చేసిన విజువల్స్ ని చూపించాలి కదా. సాంగ్ అవి ఉండాలి అంటే ముందు సాంగ్ షూటింగ్ అవ్వాలి. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాడు త్రివిక్రమ్. నవంబర్ ఫస్ట్ వీక్ లో గుంటూరు కారం సినిమా నుంచి థమన్ కంపోజ్ చేసిన ఒక మెలోడీ సాంగ్ ని షూట్ చేయబోతున్నాడు. మహేష్-శ్రీలీల పైన షూట్ చేయనున్న ఈ సాంగ్ కంప్లీట్ అయిన తర్వాతే లిరికల్ వీడియో బయటకి రానుంది. అప్పటివరకూ సాంగ్ బయటకి వచ్చే అవకాశమే లేదు.