Guntur Kaaram Sucess parties to continue today and tomorrow: మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్లుగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రఘుబాబు, జయరాం, ఈశ్వరి రావు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు నిన్న తనతో పాటు నటించిన కో స్టార్స్ ని ఇంటికి పిలిచి ఒక పెద్ద పార్టీ ఇచ్చారు. అయితే ఈ పార్టీలో దర్శకులు మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి కూడా కనిపించారు. కానీ ఈ గుంటూరు కారం సినిమా దర్శకుడు గురూజీ అలియాస్ త్రివిక్రమ్ కనిపించక పోవడంతో పెద్ద చర్చ జరిగింది.
Kanguva: సూర్య ‘కంగువ’ సెకండ్ లుక్ వచ్చేసింది.. చూశారా?
అయితే దానికి సంబంధించిన అసలు కారణం వెలుగులోకి వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ జలుబు జ్వరంతో బాధపడుతున్నారని అందుకే పార్టీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు నిన్న తనతో పాటు నటించిన వారికి పార్టీ ఇవ్వగా ఈరోజు తన సినిమాకి పనిచేసిన టెక్నిషియన్స్ కి పార్టీ ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది. అదేవిధంగా రేపు సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వారిని పిలిచి పార్టీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. జలుబు, జ్వరం తగ్గితే ఈరోజు పార్టీకి గురూజీ కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రచారం జరుగుతోంది. ఇక కుదరకపోతే రేపు అయినా సరే ఆయన కనిపిస్తారని అంటున్నారు. ఇక నిన్న రాత్రి జరిగిన పార్టీలో శ్రీ లీల, మీనాక్షి చౌదరిలతో పాటు మరి కొంత మంది కూడా కనిపించారు. వీరందరి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి