Guntur Kaaram: ఇవెక్కడి సెంటిమెంట్లు… మహేష్ ఫ్యాన్స్ కి భయమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక విషయం రిపీట్ అవ్వడంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారి మరింత ఎక్కువ ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చాయి. ఇందులో ఒకటి మాస్ సాంగ్ కాగా ఇంకొకటి మెలోడీ. ఈ రెండు సాంగ్స్ గుంటూరు కారం సినిమా మూడ్ ని తెలిపేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ ‘ధమ్ మసాలా’ నవంబర్ 7న బయటకి వచ్చింది. సెకండ్ సాంగ్ ఓ మై బేబీ డిసెంబర్ 13న రిలీజ్ అయ్యింది. ఇదే డేట్స్ కి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అజ్ఞాతవాసి సినిమాలోని పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ మోస్ట్ హైప్డ్ సినిమాగా అజ్ఞాతవాసి తెరకెక్కింది.
అజ్ఞాతవాసి నుంచి ఫస్ట్ సాంగ్ ‘బయటకొచ్చి చూస్తే’ నవంబర్ 7నే రిలీజ్ అయ్యింది. అజ్ఞాతవాసి సినిమాలోని సెకండ్ సాంగ్… గాలి వాలుగా డిసెంబర్ 12న రిలీజ్ అయ్యింది కానీ ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్ కోసం అనిరుధ్ స్పెషల్ గా ట్రిబ్యూట్ వీడియో చేసాడు. ఆ ట్రిబ్యూట్ సాంగ్ డిసెంబర్ 13నే రిలీజ్ అయ్యింది. ఇలా రెండు సినిమాల పాటలు ఒకే డేట్ ని రిలీజ్ అవ్వడంతో రిలీజ్ కూడా అజ్ఞాతవాసి సినిమాలాగే ఉంటుందేమో అనే కామెంట్స్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి. సెంటిమెంట్స్ ని ఎక్కువగా నమ్మే ఫిల్మ్ ఇండస్ట్రీలో గుంటూరు కారం సాంగ్ రిలీజ్ డేట్స్ అజ్ఞాతవాసితో మ్యాచ్ అవుతుంటే మేకర్స్ క్రాస్ చెక్ చేసుకోలేదా లేక గుంటూరు కారం సినిమాపై ఉన్న నమ్మకంతో సెంటిమెంట్ ని పట్టించుకోకుండా ప్రమోషన్స్ చేస్తున్నారా అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!