Guntur Kaaram: ఈ రోజు దద్దరిల్లిపోద్ది… SSMB 29 కోసం వెయిటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో మూడు రోజుల్లో రమణగాడి రచ్చ స్టార్ట్ కానుంది. అయితే అది థియేటర్లో కానీ దానికంటే ముందు రమణగాడి కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదని… ఈ రోజు జరగనున్న ఈవెంట్ చెబుతోంది. జనవరి 6న హైదరాబాద్‌లో జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చేసిన మేకర్స్… ఇప్పుడు గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌గాను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈవెంట్ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గుంటూరు సమీపంలోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద గల భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఓపెన్ ప్లేస్‌లో ఈ వేడుక నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఆరంభమౌతుంది. ఈ ఈవెంట్‌కు మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో రమ్యకృష్ణ, జగపతి బాబు, చినబాబు… సహా పలువురు నటీనటులు, టెక్నీషియన్లు హాజరు కానున్నారు.
బహిరంగ స్థలం కావడం వల్ల ఎంతమంది అభిమానులు వచ్చినా సరే.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో మహేష్ బాబు స్పీచ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా… మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏదైనా అప్డేట్ ఉంటుందా? అని ఎదురు చూస్తున్నారు. మహేష్ నోటి నుంచి రాజమౌళి పేరొస్తుందా? ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఏదైనా చెబుతాడా? షూటింగ్ అప్డేట్ ఇస్తాడా? ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అని వెయిట్ చేస్తున్నారు కానీ రాజమౌళినే ఎలాంటి మ్యాటర్ రివీల్ చేయడం లేదు కాబట్టి… మహేష్ బాబు కూడా ఎలాంటి అప్టేట్ ఇచ్చే ఛాన్స్ లేదు కానీ… ఉండడమ్మా, నెక్స్ట్ ఏంటో చూస్తారు… అని చెప్పిన చాలు, మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం గ్యారెంటీ. మరి మహేష్ ఏం చేస్తాడో చూడాలి.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!