Guntur Kaaram Pre Release Event Highlights: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సంక్రాంతి సంధర్భంగా మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నేడు గుంటూరులో ఘనంగా జరిగింది. ఇక ఆ ఈవెంట్ హైలైట్స్ ఏమిటో చూద్దాం పదండి
- గుంటూరుకి స్పెషల్ ఫ్లైట్ లో టీమ్
- స్పెషల్ ఫ్లైట్ లో మహేష్, త్రివిక్రమ్, హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షీ.. థమన్, నాగవంశీ, చినబాబు, దిల్ రాజు
- బాబులకే బాబు మహేష్ బాబు అనే నినాదాలతో దద్దరిల్లిపోయిన ఈవెంట్
- నెట్టింట వైరల్ గా ఫోటోలు, వీడియోలు
Read More at:Mahesh Babu: బాబు గుంటూరు లో ల్యాండ్ అయ్యాడు.. రుబాబు మొదలెట్టండిరా
దిల్ రాజు
- మాట్లాడుతూ గుంటూరు వైబ్స్ చాలా బాగున్నాయి
- సంక్రాంతి సినిమా రిలీజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది
- తమన్ అందించిన మూడు పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి
- సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటలు ఇంకా దుమ్ము రేపుతాయి
- ఒక మాస్ సాంగ్ కి మహేష్ బాబు శ్రీ లీల చేసే డాన్స్ తో స్క్రీన్లు చిరిగిపోతాయి
- తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది
- మీరందరూ రాసి పెట్టుకోండి కొన్ని పేపర్లు ఎక్కువ తీసుకువెళ్లండి
- ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమా రాబోతోంది
Dil Raju: మహేష్-శ్రీ లీల దెబ్బకి స్క్రీన్లు చిరిగిపోతాయ్.. కలెక్షన్లతో తాట తీస్తాడు!
మహేష్ బాబు
- గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
- త్రివిక్రమ్ గారంటే నాకు చాలా ఇష్టం, నాకు స్నేహితుడు కంటే ఎక్కువ.
- ఆయన సినిమాల్లో నేను చేసినప్పుడల్లా నా పర్ఫామెన్స్ లో ఒక మ్యాజిక్ జరుగుతుంది
- గుంటూరుకారంలో మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు. దా
- లవ్ యు త్రివిక్రమ్ సార్.
- మా నిర్మాత చినబాబు ముఖంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా.
- శ్రీలీల చాలారోజుల తర్వాత ఒక తెలుగమ్మాయి పెద్ద హీరోయిన్ కావడం చాలా ఆనందంగా ఉంది.
- ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం హీరోలు అందరికీ తాట ఊడిపోయిద్ది.
- శ్రీలీలకి అద్భుతమైన భవిష్యత్ ఉంది.
- థమన్ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తాడు
- ఈ సినిమాలో ఆ కుర్చీ మడతపెట్టి చేస్తావా అని నేను, త్రివిక్రమ్ గారు అడిగితే అసలు ఆలోచించకుండా వెంటనే చేశాడు
- వేరే ఏ సంగీత దర్శకుడైనా పది డిస్కషన్ లు పెట్టేవాడు, థమన్ అలా చేయలేదు.
- రేపు ఆ పాట మీరు చూడండి.. థియేటర్లు బద్దలైపోతాయి. థాంక్యూ థమన్.
Mahesh Babu: హీరోలందరికీ తాట ఊడిపోతుంది.. ఎమోషనల్ అయిన మహేష్
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
- మీ అందరి మధ్యలో ఈ ఫంక్షన్ చేయాలని అనుకున్నాం.
- సూపర్ స్టార్ కృష్ణతో గడిపిన ప్రతిక్షణం కూడా నాకు చాలా చాలా అపూర్వమైనది, అమూల్యమైనది.
- అంత గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్ ఇంకెంత అదృష్టవంతుడు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.
- ఒక్క సినిమాకి వంద శాతం పని చేయాలంటే రెండొందల శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మహేష్ అని చెప్పడంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరూ కూడా వెనక్కి తిరిగి చూడరు.
- కృష్ణ గారి తరపున మీరందరూ ఆయన వెనక ఉండాలని, ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి 12 న థియేటర్లలో కలుద్దాం
Trivikram: ఈ సంక్రాంతి రమణ గాడితో కలిసి జరుపుకుందాం
శ్రీ లీల
- దర్శకుడు త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు..
- రాఘవేంద్రరావు గారి సినిమా తర్వాత ఇది మళ్ళీ నాకు రీ లాంచ్ లా అనిపిస్తుంది.
- నాకు అమ్ము పాత్ర ఇచ్చినందుకు, నన్ను గైడ్ చేసినందుకు, సెట్ లో నా టార్చర్ భరించినందుకు త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు.
- ఎక్కడో ప్రేక్షకుల మధ్యలో ఉండి చూడాల్సిన దానిని, దేవుడి దయ వల్ల ఇక్కడున్నాను
- మీకోసం గుంటూరు కారంతో వస్తున్నాను.
- ఈ కారంలో కొంచెం తీపి తెస్తూ.. నేను మీ అమ్ము.. మీకోసం థియేటర్లలో ఎదురుచూస్తూ ఉంటాను.” అన్నారు.
Sreeleela: మహేష్ ను చూస్తే మాట రాకపోయేది.. రోజూ తిట్టుకునేదాన్ని
మీనాక్షి చౌదరి
- త్రివిక్రమ్ తో కలిసి పని చేయాలనే కల నెరవేరింది.
- ఆయనను అందరూ గురూజీ అని ఎందుకు పిలుస్తుంటారో అర్థమైంది.
- డ్యాన్సింగ్ స్టార్ శ్రీలీల సెట్స్ లో ఎంతో ఎనర్జీ తీసుకొచ్చింది
- మహేష్ బాబు గారి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని కాల్ వచ్చినప్పుడు షాక్ లో ఉన్నా
- ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో మహేష్ గారు ఒకరు
- ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా