Dil Raju Speech at Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ రిలీజ్ అవుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు నిర్మించిన ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ఈరోజు గుంటూరులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ కి నైజాం, ఉత్తరాంధ్ర హక్కులు కొనుక్కున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ గుంటూరు వైస్ చాలా బాగున్నాయని ఇప్పటికే సంక్రాంతి సినిమా రిలీజ్ అయిపోయినట్టు అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. నిర్మాతలుగా సక్సెస్ సాధించడం అంత ఈజీ కాదు అని అంటూనే ఈ సినిమాకి నిర్మాతలు వ్యవహరించిన చినబాబు నాగ వంశీ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పారు దిల్ రాజు. ఆ బ్యానర్ కి అన్ని విధాలుగా అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న త్రివిక్రమ్ కి థాంక్స్ చెప్పిన దిల్ రాజు ఆ సక్సెస్ లో తాను కూడా భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. తమన్ అందించిన మూడు పాటలు రిలీజ్ అయ్యాయి, ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయని అన్నారు. కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే అందరినీ ఆకట్టుకుందని చెప్పుకొచ్చారు అప్పుడే ఏమీ అవలేదు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటలు ఇంకా దుమ్ము రేపుతాయని దిల్ రాజు పేర్కొన్నారు.
Hanuman: ఏమైనా క్రియేటివిటీనా.. వర్త్ వర్మా.. వర్త్ అంతే
ఒక మాస్ సాంగ్ కి మహేష్ బాబు శ్రీ లీల చేసే డాన్స్ తో స్క్రీన్లు చిరిగిపోతాయి అన్నారు. కేవలం పాటలు మాత్రమే కాదు మిక్సింగ్ జరుగుతున్నప్పుడు నేను కొన్ని సీన్స్ చూశాను ఆ సీన్స్ కి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది, మీరందరూ రాసి పెట్టుకోండి కొన్ని పేపర్లు ఎక్కువ తీసుకువెళ్లండి ఆ సీన్స్ లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇద్దరు ముద్దుగుమ్మలు మీనాక్షి, శ్రీ లీల అదరగొట్టారని ముఖ్యంగా తాను చూసిన ఒక సాంగ్లో శ్రీ లీల డాన్స్ మాత్రం వేరే లెవల్ అని చెప్పుకొచ్చారు. నేను ఎక్స్పెక్టేషన్స్ పెంచేయాలి అని అనుకోవడం లేదు కానీ చూసింది గుర్తు వస్తే మాట్లాడకుండా ఉండలేక పోతున్నానని అన్నారు. త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ ఆయన ప్రతి సినిమాకి ఏదో ఒక మాయ చేస్తాడని హీరో క్యారెక్టర్ తో నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఆలోచింపచేస్తూ యాక్షన్ కూడా చేయిస్తూ అందరినీ అలరిస్తాడని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు ఈ సినిమాతో కలెక్షన్లతో తాట తీస్తాడని దిల్ రాజు కామెంట్ చేశారు. పోకిరి దూకుడు లాంటి క్యారెక్టర్ల తర్వాత ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ మనకి వదులుతున్న గుంటూరు కారమే మహేష్ బాబు అని అన్నారు. గత మూడు నాలుగు సినిమాల నుంచి మహేష్ బాబు తన ప్రతి సినిమాలో ఒక సాంగ్ కి అద్భుతంగా డాన్స్ చేసి అదరగొడుతున్నాడు, అది కేవలం మీ అభిమానుల కోసం మాత్రమే అని అన్నారు. గుంటూరు కారం సినిమాలో కుర్చీ పాట వేరే లెవెల్ లో ఉంటుందని, మీరు రెడీగా ఉండండి ఆ పాట ఎప్పుడొస్తుందా అని సిద్ధంగా ఉండండి అని పేర్కొన్నారు. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమా రాబోతోంది, కేవలం గుంటూరు కారం గుంటూరు వారికి మాత్రమే కాదు తెలుగువారు ఎక్కడ ఉన్నా అక్కడ ఆనందాలు పంచుతుంది అని చెప్పుకొచ్చారు.