Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. టాక్ ఎలా ఉన్నాకూడా కలక్షన్స్ లో మాత్రం రికార్డు సృష్టించింది. ఈ సినిమా వారం రోజుల్లో 212 కోట్ల రూపాయల కలెక్ట్ చేసినట్లుగా సినిమా యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత ఎంత కలెక్షన్స్ వచ్చాయనే విషయం మీద అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. ఇక ఈ సినిమా ఓటిటీలోకి రాబోతుంది. అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో మేకర్స్.. ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే ధమ్ మసాలా బిర్యానీ, అమ్మ సాంగ్ ను రిలీజ్ చేయగా .. తాజాగా ఇండస్ట్రీని షేక్ చేసిన ఆ కుర్చీని మడతపెట్టి వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు మహేష్ బాబు చేయని మాస్ డ్యాన్స్ ను ఈ సాంగ్ లో చూసారు అభిమానులు. ఈ సాంగ్ రిలీజ్ అయ్యినప్పుడు ఎంత వివాదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అదే పాట థియేటర్ లో రచ్చ లేపింది. శ్రీలీలకు ధీటుగా బాబు డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ ఇవ్వగా.. సాహితి చాగంటి, శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.