గుంటూరు కారం సినిమాపై మహేష్ ఫాన్స్ పెట్టుకున్న హోప్స్ మాటల్లో చెప్పడం కష్టమే. దాదాపు 12 ఏళ్ల క్రితం కలిసి సినిమా చేసిన త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ కోసం ఎంతగానే వెయిట్ చేసారు ఫాన్స్. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మహేష్ త్రివిక్రమ్ కలిసి గుంటూరు కారం సినిమాని అనౌన్స్ చేయగానే సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆ బజ్ ని మరింత పెంచుతూ మాస్ స్ట్రైక్ వీడియో బయటకి వచ్చింది. వింటేజ్ స్టైల్ లో మహేష్ కారాబీడీ తాగుతూ, తలకి పాగా కట్టి ఊర మాస్ లుక్ లో కనిపించే సరికి గుంటూరు కారం మాస్ స్ట్రైక్ వీడియో డిజిటల్ వ్యూస్ లో కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. దీంతో అతడు, ఖలేజా సినిమాలతో హిట్ పడలేదు కానీ గుంటూరు కారం సినిమా మాత్రం మహేష్ త్రివిక్రమ్ లకి ఇండస్ట్రీ హిట్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా ప్రిడిక్ట్ చేసాయి. అయితే ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ ఈ మూవీ షూటింగ్ గురించి ఎన్నోన్నో రూమర్స్ వినాల్సి వస్తుంది. గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే అవుట్ అయ్యిందని, ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చిందని… థమన్ ని తీసేసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టనున్నారని, లేటెస్ట్ గా కెమెరామాన్ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని… ఇలా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇందులో ఏ వార్త నిజం, ఏ వార్త అబద్దం అనే విషయం తెలియదు కానీ థమన్ పైన మాత్రం చాలా రూమర్స్ వచ్చాయి. మ్యూజిక్ పై ద్రుష్టి పెట్టకుండా క్రికెట్ ఆడుతున్నాడు, సినిమాలు ఎక్కువ అయ్యాయి, ఒక్క సాంగ్ కూడా ఫైనల్ చేయలేదు లాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఈ మాటలు ఆగాలన్నా, గుంటూరు కారం సినిమా గురించి సోషల్ మీడియాలో జరిగే గోల సైలెంట్ అయిపోవాలన్నా ఉన్నపళంగా ఒక సాలిడ్ అప్డేట్ బయటకి రావాలి. ఇలాంటి అప్డేట్ ని ఇవ్వడానికే త్రివిక్రమ్ అండ్ థమన్ రెడీ అవుతున్నారు. గుంటూరు కారం సినిమాలోని మొదటి సాంగ్ ని ముంబై రికార్డింగ్ కంప్లీట్ చేసారు. ఈ సాంగ్ మహేష్ వరకూ ఇంకా వెళ్లలేదు కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే రోజున ఘట్టమనేని ఫాన్స్ కి గిఫ్ట్ గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.