సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. “గల్లీ రౌడీ” సెప్టెంబర్ 3న నవ్వుల దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించారు. సాయి కార్తీక్, రామ్ మిరియాలా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్ కు, సాంగ్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.
Read also : “భీమ్లా నాయక్” వచ్చేశాడు… పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్
ఈ చిత్రానికి ముందు సందీప్ కిషన్ “ఏ1 ఎక్స్ ప్రెస్” మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు కామెడీ జోనర్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు సందీప్. మరి ఈ చిత్రంతోనైనా ఈ యంగ్ హీరోకు హిట్ లభిస్తుందేమో చూడాలి.