బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. గల్లీ బాయ్ చిత్రంలో ర్యాపర్ గా కనిపించిన ధర్మేష్ పర్మర్(24) అలియాస్ మెక్ టాడ్ ఫాడ్ మృతి చెందాడు. సోమవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే అతని మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక టాడ్ ఫాడ్ మృతి గురించి తెలుసుకున్న అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ముంబైలో ఫేమస్ మ్యూజికల్ బ్యాండ్ నిర్మించి ఎన్నో పాటలు పాడి ఫేమస్ అయిన టాడ్ ఫాడ్ గల్లీ బాయ్స్ చిత్రంలో ర్యాపర్ గా కనిపించి ఎంతోమంది ప్రేక్షకుల మన్ననలు పొందాడు.
ఇక ధర్మేష్ మృతి పట్ల గాలిబావోయ్ చిత్ర బృందం సంతాపం వ్యక్తం చేసింది. గల్లీ బాయ్ హీరో రణవీర్ సింగ్.. ధర్మేష్ ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయం విన్న వెంటనే నా హృదయం బద్దలయ్యింది అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేశారు. ఇక గల్లీ బాయ్ డైరెక్టర్ జోయా అక్తర్, ధర్మేష్ మృతి వార్త విని ఎమోషనల్ అయినట్లు తెలిపారు. “ఇంత చిన్న వయస్సులోనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావనుకోలేదు. నిన్ను చూసి నేను గర్విస్తున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ లు నెట్టింట వైరల్ గా మారాయి.
