NTV Telugu Site icon

The Kerala Story: కేరళ స్టోరీ సినిమా టికెట్ చూపిస్తే కాఫీ, టీ ఫ్రీ..

Kerala Story

Kerala Story

The Kerala Story: వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన ‘‘ ది కేరళ స్టోరీ’’ సినిమా థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఈ సినిమాపై నిషేధం విధించింది. ఇక తమిళనాడు ప్రభుత్వం మల్టీప్లెక్సుల్లో సినిమా ప్రదర్శనను బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినిహాయింపులను కల్పించాయి. కొన్ని చోట్ల మహిళలకు ఈ సినిమాను ఉచితంగా చూపిస్తున్నారు.

Read Also: Sudhakar Babu: బాబు నికృష్ట రాజకీయాలకు సమాధానం చెప్పగలిగే ఏకైక నేత జగన్‌..

ఇదిలా ఉంటే గుజరాత్ కు చెంది టీ షాపు యజమాని ఈ సినిమా టికెట్ చూపిస్తే ఉచితంగా టీ, కాఫీ ఇస్తానని ప్రకటించారు. దీనికి సంబంధించి పోస్టర్లు అంటించాడు. గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక టీ విక్రేత ‘ది కేరళ స్టోరీ’ సినిమా టిక్కెట్‌ను చూపించే కస్టమర్‌లకు ప్రత్యేకమైన ఆఫర్‌ ప్రకటించాడు. సూరత్‌లోని వేసు ప్రాంతంలోని ‘కేసరియా టీ షాప్’ యజమాని ‘ ది కేరళ స్టోరి’ టికెట్ చూపించిన వారికి ఉచితంగా టీ, కాఫీ అందిస్తానని ప్రకటించారు. ఈ ఆఫర్ మే 15, 2023 వరకు ఉంటుందని ప్రకటించాడు.

కేరళలో మతమార్పిడులు, ఉగ్రవాదం ఇతివృత్తంగా ‘ ది కేరళ స్టోరీ ’ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్ విడులైనప్పటి నుంచి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, టీఎంసీ వంటి ప్రతిపక్షాలు దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమా ఆర్ఎస్ఎస్ అబద్ధపు ప్రచారమని విమర్శించారు. కేరళకు చెందిన ఓ ముస్లిం సంస్థ సినిమాలో చెప్పిన దాన్ని నిరూపిస్తే కోటి రూపాయాలు ఇస్తామని ప్రకటించింది.