Lavanya allegations on Mastan sai: రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ అంశంలో ఒక షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ కేసులో మస్తాన్ సాయి అనే పేరు ముందు నుంచి వినిపిస్తోంది. లావణ్య మస్తాన్ సాయితో అక్రమ సంబంధం పెట్టుకుందని రాజ్ తరుణ్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈరోజు మస్తాన్ సాయి అనే వ్యక్తిని పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు తర్వాత లావణ్య మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయట పెట్టింది. అసలు రాజ్ తరుణ్ వ్యవహారం వెనుక ఉన్నది మస్తాన్ సాయి అని కామెంట్ చేసింది. అతను అనేకమంది అమ్మాయిలను ట్రాప్ చేశాడని, సుమారు 45 మంది అమ్మాయిలను ట్రాప్ చేసినట్లు తనకు తెలుసు అని చెప్పుకొచ్చింది.
Also Read: రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. మస్తాన్ సాయి ఫోన్ లో అమ్మాయిల వీడియోలు!!
తనను కూడా అదే విధంగా ట్రాప్ చేసి తన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పుకొచ్చింది. వారం క్రితం వరకు కూడా తన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడని అతను బయట ఉండడంతోనే అతని విషయం చెప్పలేకపోయాను అని అంటోంది. ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా మస్తాన్ సాయి తనకు పరిచయమయ్యాడని తమ రెండవ మీటింగ్ లోనే ఇంట్లో కెమెరాలు పెట్టి తన వీడియో తీసి బెదిరించాడని ఆమె ఆరోపిస్తోంది.. అంతేకాదు మస్తాన్ సాయి రాజ్ తరుణ్ణి కూడా చంపేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్లబోతోంది అనేది వేచి చూడాల్సి ఉంది.