పాపులర్ తెలుగు యాంకర్, హోస్ట్, సుమ కనకాల ప్రధాన పాత్రలో “జయమ్మ పంచాయతీ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాన్నాళ్ల తరువాత బిగ్ స్క్రీన్ కు రీఎంట్రీ ఇస్తున్న సుమ మంచి కంటెంట్ ఉన్న స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మే 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ముందుగా మ్యూజికల్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు.
Read Also : Kangana Ranaut : ఆరేళ్ళకే లైంగిక వేధింపులు… క్వీన్ షాకింగ్ కామెంట్స్
అందులో భాగంగా సినిమాలోని “గొలుసు కట్టు గోసలు” పాటను తాజాగా విడుదల చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, చారు హరిహరన్ పాడిన ఈ పాట చాలా ఎమోషనల్ గా ఉంది. సాంగ్ ను సరిగ్గా వింటే సినిమా మెయిన్ స్టోరీ అంతా ఇందులోనే ఇమిడి ఉందనిపిస్తోంది. చైతన్య ప్రసాద్ సాహిత్యంతో రూపొందిన ఈ సాంగ్ మనసుకు హత్తుకునేలా ఉంది. మరి వెండితెరపై ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ విలేజ్ డ్రామాకి ఎడిటర్ గా రవితేజ గిరిజాల బాధ్యతలు చేపట్టారు.