పాపులర్ తెలుగు యాంకర్, హోస్ట్, సుమ కనకాల ప్రధాన పాత్రలో “జయమ్మ పంచాయతీ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాన్నాళ్ల తరువాత బిగ్ స్క్రీన్ కు రీఎంట్రీ ఇస్తున్న సుమ మంచి కంటెంట్ ఉన్న స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మే 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ముందుగా మ్యూజికల్ ప్రమోషన్స్ పై…
పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల కమ్ బ్యాక్ ఫిల్మ్ “జయమ్మ పంచాయితీ” విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రైలర్ బాగుందంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించిన పవన్, సినిమా హిట్ కావాలని కోరుకుంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ట్రైలర్ లో భర్త అనారోగ్యం పాలయ్యేంత వరకు సంతోషకరమైన జీవితాన్ని గడిపే సాధారణ గృహిణిగా కన్పించింది…
“జయమ్మ పంచాయితీ”లో సుమ గొడవ ఆసక్తికరంగా మారింది. యాంకర్ సుమ రీ-ఎంట్రీ చిత్రం “జయమ్మ పంచాయితీ” టీజర్ తాజాగా విడుదలైంది. రానా విడుదల చేసిన ఈ విలేజ్ డ్రామా మూవీ టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామ పెద్ద, మొత్తం గ్రామస్తుల ముందు సుమ తన దృఢమైన వైఖరిని చూపడంతో టీజర్ ప్రారంభమవుతుంది. స్పష్టంగా ఆమె ఒక సమస్యపై న్యాయం కోరుతుందని అర్థమవుతోంది. అయితే ఆమె సమస్య ఏమిటన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో ఉంచారు మేకర్స్.…