కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా.. నయనతార – సమంత హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాథువాక్కుల రెండు కాదల్’. నయన్ తార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో కె ఆర్ కె.. ”కణ్మణి రాంబో ఖతీజా” అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని ‘టూ టూ టూ’ అనే సాంగ్ గ్లింప్స్ ను మేకర్స్ రిలిక్ చేశారు. తమిళ్ లో ఈ సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోఇప్పటికే ఈ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయగా తాజాగా ఈ సాంగ్ వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. సమంత వర్సెస్ నయన్ తార మధ్యలో విజయ్ సేతుపతి నలిగిపోతున్నట్లు వీడియోలో చూపించారు.
‘టూ టుటూ.. టూ టుటూ.. టూటూ టూటూ.. ఐ లవ్ యూ టూ నిజమే ఐ లవ్ యూ టూ..’ అంటూ సాగిన ఈ పాట తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన హీరో.. ఇద్దరినీ ప్రేమిస్తున్నట్లు తెలుపుతూ ఐ లవ్ యూ టూ అని చెప్పడం ఆకట్టుకుంటుంది. ఇక మోడ్రన్ డ్రెస్ లో సమంత.. ట్రెడిషనల్ డ్రెస్ లో నయన్ పోటాపోటీగా డాన్స్ చేస్తూ అదరగొట్టేశారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో సాహితీ చాగంటి – సంజన సాంగ్ ను మంచి హుషారుగా ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 28 న రిలిజ్ కానుంది. మరి ఈ సినిమాతో నయన్ – విఘ్నేష్ జంట విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.