సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఘట్టమనేని రమేష్ బాబు అంత్యక్రియలను ఆచారాల ప్రకారం పూర్తి చేశారు. ఆయన చితికి కుమారుడు జయకృష్ణ నిప్పు పెట్టారు. కోవిడ్ నిబంధనలతో అతి కొద్దిమంది సమక్షంలోనే రమేష్ బాబు అంత్యక్రియలు జరిగాయి. కోవిడ్ కారణంగా మహేష్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేదు. తమ్మారెడ్డి భరద్వాజ, సీనియర్ నటుడు నరేష్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Read Also : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పిక్ లీక్… మీడియాకు రిక్వెస్ట్
నిన్న సాయంత్రం రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు ఆరోగ్యం నిన్న క్షీణించడంతో ఆసుపత్రికి తరలించే లోగానే మృతి చెందారు. ఆయన హఠాన్మరణం ఇండస్ట్రీని షాక్ గురి చేసింది. ఇక రమేష్ బాబుకు అంతిమ నివాళులర్పించేందుకు ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో మహేష్ బాబు సోదరుడి పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.