మహేశ్ బాబుని స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్ ని చేసిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండే ‘ఒక్కడు’. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యాక్షన్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామా మహేశ్ బాబు 7వ సినిమాగా రెండు దశాబ్దాల క్రితం రిలీజ్ అయ్యింది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఒక్కడు మూవీ ఒక మోడరన్ క్లాసిక్ లా టాలీవుడ్ లో ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఉన్న చాలా మంది యంగ్ మహేశ్ ఫాన్స్ ఒక్కడు సినిమాని థియేటర్స్ లో చూసి ఉండరు. ఆ మాస్ హిస్టీరియాని థియేటర్స్ లో చూసే ఛాన్స్ మరోసారి వచ్చింది. ఈరోజు చాలా సెంటర్స్ లో ఒక్కడు సినిమా రీరిలీజ్ అయ్యింది. మహేశ్ ఫాన్స్ ఒక్కడు సినిమా రిలీజ్ అయిన సెంటర్స్ లో చేస్తున్న హంగామాని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి థియేటర్ దగ్గర ఫాన్స్ సంబరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో ఉండే వాళ్లకి మాత్రమే తెలిసేది. ఇప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల పుణ్యమాని ఫాన్స్ హంగామా ఏ రేంజులో ఉంటుందో అందరికీ తెలుస్తుంది.
ఇప్పుడు ఒక్కడి సినిమాకి కూడా ఫాన్స్ చేస్తున్న హంగామా చూస్తుంటే ఒక రెండు దశాబ్దాల క్రితం రిలీజ్ అయిన సినిమాకి, ఒక రీరిలీజ్ సినిమాకి కూడా ఈ రేంజులో సెలబ్రేషన్స్ చేస్తారా అని ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మార్నింగ్ షో సమయంలో థియేటర్స్ ముందు కటౌట్ లు కట్టి, బాణాసంచాలు పేల్చి మహేశ్ ఫాన్స్ చేసిన సెలబ్రేషన్స్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అంతే. ఒక్కడు రీరిలీజ్ బుకింగ్స్ కూడా సాలిడ్ గా ఉన్నాయి, ఇటివలే రీరిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ ఖుషీ మూవీ రికార్డ్స్‌ను మహేశ్ ఫాన్స్ నైజాం ఏరియాలో లేపేసేలా ఉన్నారు. దీంతో నైజాం ఏరియాలో మహేశ్ బాబు ఎంత స్ట్రాంగ్ హోల్డ్‌ను మెయింటైన్ చేస్తున్నాడో అర్ధం అవుతుంది.