యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవర. గతేడాది సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కు టాలివుడ్ లో తొలి సినిమాతోన బ్లాక్ బస్టర్ ను తన ఖాతలో వేసుకుంది. రాజమౌళి సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేసిన హీరోగా ఎన్టీఆర్ సెన్సేషన్ చేసారు.
Also Read : Varalaxmi Sarathkumar : దర్శకురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్.. టైటిల్ పోస్టర్ రిలీజ్
కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటున్నాడని గతంలోనే ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ లైనప్ ను పరిశీలిస్తే దేవర 2 ఉండదనే చర్చ నడించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవర 2 ఉంటుందని ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇదిలా ఉండగా నేడు ఈ సినిమా రిలిజ్ అయి సంవత్సరం అయిన సందర్భంగా దేవర 2 గురించి కీలక ప్రకటన చేసారు మేకర్స్. ఈ సారి గాడ్ ఆఫ్ ఫియర్ రాబోతున్నాడు దేవర 2 కు రెడీ అవండి అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ ప్రకటనతో నందమూరి ఫ్యాన్స్ జోష్ రెట్టింపయింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత జైలర్ డైరెక్టర్ నెల్సన్ తో సినిమా చేయాల్సి ఉంది. అలాగే త్రివిక్రమ్ తో కూడా సినిమా చేయబోతున్నాడు. మరి ఈ గ్యాప్ లో దేవర 2 ను ఎన్టీఆర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి. మరోవైపు దర్శకుడు కొరటాల దేవర 2 స్క్రిప్ట్ వర్క్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.