టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా మాట్లాడే వారిలో నటి గాయత్రి గుప్తా పేరు ముందు వరుసలో ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన గాయత్రీ, తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమాల కంటే వ్యక్తిగత విషయాలు, విభేదాలు, వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రీ గుప్తా, తనపై జరిగిన లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందుల గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది.
Also Read : Nidhhi Agerwal : ప్రభుత్వ వాహనంలో నటి నిధి అగర్వాల్ షికారు.. నెటిజన్ల ఆగ్రహం!
గాయత్రీ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి అనేక రేప్ అటాక్స్‌కి గురయ్యాను. కాలేజీ రోజుల్లో హాలీవుడ్ సినిమాల నుంచి వచ్చిన క్లిప్స్ చూసి చాలా భయపడ్డా. తెలుగు వాళ్లు మంచివాళ్లు అనుకున్నా.. కానీ ఆడిషన్స్‌కి వెళ్తే ప్రతి చోటా కమిట్‌మెంట్ అడగటం, బలవంతపు ప్రవర్తన ఎదుర్కోవటం రోజువారీగా జరిగేది. ధైర్యంగా మాట్లాడితే నన్ను చంపేస్తామని, రేప్ చేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి” అని ఆమె అన్నారు. అత్యంత షాకింగ్‌గా, ఒక నిర్మాత-దర్శకుడు కలిసి తనపై లైంగిక దాడి ప్రయత్నం చేసిన ఘటనను ఆమె వివరించారు.
“ ఒకసారి ట్రైలర్ హిట్ అయిన సందర్భంగా పిలిచారు. నేను మద్యం తాగనని చెప్పినా, బలవంతంగా తాగించారు. ఒక్కసారిగా పోయడంతో మత్తు జరిగిన మత్తుగా ఉంది. ఆ సమయంలో, ప్రొడ్యూసర్ కారులో డ్రాప్ చేస్తానని చెప్పి, డ్రైవర్ రావడానికి టైం పడుతుందని.. నన్ను గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ నా డ్రెస్ లాగడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ ఆ డ్రెస్ కొంచెం లూజ్‌గా ఉండటం, డిజైనర్ వేసిన కుట్లు కారణంగా డ్రెస్ చినగలేదు. కానీ ఒక గంటపాటు నన్ను బలవంతం చేశాడు” అని గాయత్రీ గుప్తా చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె ధైర్యాన్ని అభినందిస్తుండగా, మరికొందరు ఈ సమస్యలు ఎప్పటికీ ముగియవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.