Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలు, ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకుంటుందో.. గ్యాప్స్ మధ్యలో షూటింగ్ చేస్తున్నారో అర్ధం కాకుండా మారింది.అయితే ఈ మధ్య పవన్ ఎక్కువగా ఉస్తాద్ షూట్ లోనే కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినట్లు మేకర్స్ అధికారికంగా తెలుపడంతో పాటు సెట్స్ లో ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. పవన్ ఇందులో పోలి గా కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఇకపోతే ఈ చిత్రంలో కమల్ మాజీ భార్య నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. నటి గౌతమి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Niharika Konidela: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన మెగా డాటర్.. ఈసారి ఏకంగా
కమల్ హాసన్ తాళి కట్టకపోయినా.. గౌతమి, కమల్ భార్య అనే చెప్పుకోవాలి. ఎన్నో ఏళ్ళు వారు సహజీవనం చేశారు. కొన్ని విబేధాలు కారణంగా ఈ జంట విడిపోయింది. ఇక క్యాన్సర్ తో పోరాటం చేసి గెలిచిన గౌతమి.. రీ ఎంట్రీతో మంచి అవకాశాలను అందుకుంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో తల్లిగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తుంది. ఇక ఉస్తాద్ లో గౌతమి.. పవన్ తల్లిగా నటిస్తుందని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. తేరి కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అందులో విజయ్ తల్లిగా రాధిక నటించింది. ఆ సినిమాలో రాధిక పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అందరికి తెల్సిందే. ఇక ఇందులో కూడా అలానే డిజైన్ చేశాడట హరీష్ శంకర్. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.