Gautham Vasudev Menon: అక్కినేని నాగ చైతన్య- సమంతల ప్రేమ కావ్యానికి ఆద్యం.. ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనే ఈ జంట ఒకరికొకరు పరిచయమయ్యారు.. ప్రేమలో పడ్డారు..పెళ్లి చేసుకొన్నారు. వీరి పెళ్లి అప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ను ఆకాశానికి ఎత్తేశారు నెటిజన్లు. ఇతని వలనే ఇంత మంచి జంట పెళ్లి చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇక విధిని ఎవరు మార్చలేరు అన్నట్లు ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని నెటిజన్లు సైతం మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా గౌతమ్ మీనన్.. ఏ మాయ చేసావే 2 చేయాలనీ ఉందని చెప్పడంతో మరోసారి చై- సామ్ పేర్లు ట్రెండింగ్ లో నిలిచాయి.
ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కిన లైఫ్ ఆఫ్ ముత్తు రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం విదితమే. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈ డైరెక్టర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు అని అడుగగా.. తనకు ఏ మాయ చేసావే 2, ఘర్షణ 2, రాఘవన్ 2 చేయాలనీ ఉందని చెప్పుకొచ్చాడు. ఘర్షణ, రాఘవన్ చేయడానికి వెంకటేష్, కమల్ హాసన్ ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. ఏ మాయ చేసావే 2 అంటే సమంత- చైతన్య మళ్లీ కలుస్తారా..?అనేది డౌట్ అని అంటున్నారు. తమకు మొదటి హిట్ ను అందించిన డైరెక్టర్ అడిగితే కాదంటారా..? అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా ఆ జంట మళ్లీ తెరపై కనిపిస్తోంది అంటే మాకు ఆనందమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి మొదటి సరి ఈ జంటను కలిపిన ఈ డైరెక్టరే మరోసారి వీరిని కలుపుతాడా..? లేదా అనేది చూడాలి.