Gautham Krishna as hero-cum-director in ‘Akasha Veedhullo…’
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా మనోజ్ జె. డి. , డా. డీజే మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ఆకాశ వీధుల్లో’. హీరో గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగానూ పరిచయం అవుతుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. డ్రాగన్ ప్రకాశ్ సమకూర్చిన యాక్షన్ పార్ట్ మూవీకి హైలైట్ గా నిలుస్తుందని దర్శక నిర్మాతలు తెలిపారు. రొటీన్ కు భిన్నంగా ఉండే ఈ సినిమాలో దేవి ప్రసాద్, బాల పరాశర్, ‘సత్యం’ రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ కీలక పాత్రలు పోషించారు. జూడా శాండీ సంగీతం అందించగా, విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

Poojitha Ponnada