చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమి కాదు. ఒక సినిమా షూటింగ్ లో ప్రేమ మొదలై .. పెళ్లిపీటలు వరకు వెళ్లిన జంటలు చాలా ఉన్నాయి. ఇక ఈ లిస్టులోకే చేరుతున్నారు కోలీవుడ్ లవ్ బర్డ్స్ గౌతమ్ కార్తీక్ – మంజిమా మోహన్. ఈ ఇద్దరు తెలుగువారికి సుపరిచితమే. కడలి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు అలనాటి సీనియర్ హీరో కార్తీక్ వారసుడు గౌతమ్ కార్తీక్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా గౌతమ్ ని మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. ఇక మంజిమా .. నాగ చైతన్యతో కలిసి సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంలో నటించి మెప్పించింది.
ప్రస్తుతం ఈ స్టార్ జంట కోలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరూ కలిసి 2019లో దేవరత్తమ్ సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. ఇక ఇటీవలే వీరిద్దరూ సొంతగా ఒక ప్లాట్ తీసుకొని అందులోనే కలిసి ఉంటున్నారట. ఇరు కుటుంబాలను ఒప్పించి త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీరి పెళ్లి ప్రకటన ఈ వాలెంటెన్స్ డే రానున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే ప్రేమికుల రోజు వరకు ఆగాల్సిందే.