ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ సొంత ఇంటి కల నెరవేరింది. కానీ అదే రోజున ఆమె ఇంట్లో విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు తాజాగా గంగవ్వ స్వయంగా ఓ వీడియో ద్వారా విషయాన్ని వెల్లడించింది. తన ఇంటిని అందరికీ చూపించడానికి చేసిన వీడియోలో ముందుగా ఈ విషయాన్ని వెల్లడించింది. అందులో తనకు ఓ బాధ ఉండడం వల్ల అందరికీ గృహ ప్రవేశం గురించి వెల్లడించలేకపోయానని చెప్పుకొచ్చింది.
Read Also : అఫిషియల్ : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్
“మా తమ్ముడికి ఒక్కగానొక్క కొడుకు. అతను మందు తాగి ఆసుపత్రిలో 13 రోజులు చికిత్స పొందాడు. సోమవారం గృహ ప్రవేశం అయితే ఆదివారమే చనిపోయాడు.. నేను అదే పరేషాన్ లో ఉన్నాను. ఇక నాగార్జున సార్, బిగ్ బాస్, మై విలేజ్ షో కారణంగా నా కల నెరవేరింది. అందరికి ధన్యవాదాలు. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి” అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ఆ తరువాత తన ఇంటికి చూపించింది గంగవ్వ. గంగవ్వ తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందినది. గంగవ్వ బిగ్ బాస్ షో నుండి రూ. 11 లక్షలు సంపాదించగా, నాగార్జున రూ. 7 లక్షల విరాళాన్ని అందించారు. 3 లక్షల అప్పు చేసి తన కల సాకారం చేసుకుంది గంగవ్వ.