Game Of Thrones Fame Ian Gelder Passes Away At 74 : హాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే టైటానిక్ నటుడు కన్నుమూయగా ఇప్పుడు ప్రముఖ హాలీవుడ్ నటుడు, టీవీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ ఇయాన్ గెల్డర్ కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. ఇయాన్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో కెవాన్ లన్నిస్టర్ పాత్రను పోషించాడు. ఇయాన్ జీవిత భాగస్వామి బెన్ డేనియల్స్ తన భర్త మరణాన్ని ధృవీకరించారు. సోషల్ మీడియాలో ఈ హృదయ విదారకమైన విషయానికి సంబంధించిన పోస్ట్‌ను షేర్ చేసారు. ఇక ఇయాన్ మరణానికి కారణం క్యాన్సర్ అని తెలుస్తోంది. ఇక ఆయన మృతి పట్ల పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతుండగా, అభిమానులు కూడా సోషల్ మీడియాలో నటుడికి నివాళులు అర్పిస్తున్నారు. ఇయాన్ గెల్డర్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో సర్ కెవాన్ లన్నిస్టర్ పాత్రను పోషించాడు. ఈ పాత్ర లార్డ్ టైవిన్ లన్నిస్టర్ తమ్ముడు, ఫైవ్ కింగ్స్ యుద్ధంలో లన్నిస్టర్ సైన్యంలో అత్యంత విశ్వసనీయ అధికారులలో ఒకడు.
Navneet kaur: జహీరాబాద్‌లో బీజేపీ తరపున నవనీత్ కౌర్ ప్రచారం..
ఇక ఆయన భార్య బెన్ డేనియల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇయాన్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి, ‘హృదయం మిలియన్ల ముక్కలుగా విరిగిపోయింది. ‘చాలా చాలా బరువైన హృదయంతో, నా ప్రియమైన భర్త, జీవిత భాగస్వామి ఇయాన్ గెల్డర్ మరణించారని నేను ప్రకటించాలనుకుంటున్నాను.’ ఇయాన్ గెల్డర్‌కు గత డిసెంబర్‌లో పిత్త వాహిక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు డేనియల్స్ పోస్ట్‌లో వెల్లడించారు. ఇక ఇయాన్ గెల్డర్‌తో తన 30 ఏళ్ల సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ‘నేను అతనిని జాగ్రత్తగా చూసుకోవడానికి నా పనిని ఆపివేసా, కానీ అది ఇంత త్వరగా జరుగుతుందని మా ఇద్దరికీ తెలియదు. అతను నా బలం, మేము 30 సంవత్సరాలకు పైగా ఒకరికొకరు భాగస్వాములుగా ఉన్నాము. మేం కలిసి లేకపోయినా రోజూ మాట్లాడుకునేవాళ్లం. అతను దయగల, అత్యంత ఉదారమైన సోల్, చాలా ప్రేమగల వ్యక్తి.