GA2 Pictures announces their movie with Narne Nithiin: గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఎన్టీఆర్ బావమరిది, వైసీపీ నేత, పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడు నార్నె నితిన్ హీరోగా రెండవ సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మించబోతున్నారు. నిజానికి నార్నె నితిన్ హీరోగా చాలా కాలం క్రితమే ఒక సినిమా అనౌన్స్ చేశారు. శతమానంభవతి ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో శ్రీ శ్రీ శ్రీ రాజావారి పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది, ఈ సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. సినిమా ఆగిపోతున్న క్రమంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సినిమాని నిలబెట్టే బాధ్యత తీసుకుని సినిమా పూర్తి చేస్తోంది. అది ఇంకా పూర్తి కాకుండానే నార్నె నితిన్ రెండవ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మించబోతున్నారు. ఇక ఈ మేరకు గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. నార్నె నితిన్ హీరోగా కంచిపల్లి అంజిబాబు డైరెక్టర్గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ అంజిబాబు గతంలో అనిల్ రావిపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఎఫ్3, సరిలేరు నీకెవ్వరు, రాజా ది గ్రేట్ వంటి సినిమాలకు ఆయన అనిల్ తో కలిసి పని చేశారు. ఇక అంజిబాబుకి ఇది మొదటి సినిమా కాబోతోంది. ఇక హీరోయిన్గా శ్రీ లీలను తీసుకునే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరిగింది కానీ ఈ సినిమాలో మాత్రం నయన్ సారిక అనే భామను హీరోయిన్గా తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాక ఈ సినిమాకి రామ్ మిరియాల మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నయన్ సారిక గతంలో ఒకటి రెండు తమిళ సినిమాల్లో నటించినట్టు తెలుస్తోంది కానీ ఏ ఏ సినిమాల్లో నటించింది అనే విషయం మీద మాత్రం పూర్తి సమాచారం లేదు.