ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ లోని లేటెస్ట్ ప్రోగ్రామ్ ‘ఫన్ ఫీస్ట్ విత్ ఆషూ రెడ్డి’కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘బిగ్ బాస్’ ఫేమ్ దేత్తడి హారికతో మొదలైన ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వ్యూవర్స్ నుండి ‘వావ్’ అంటూ అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. బట్.. ఇంతలోనే నెక్స్ట్ ఎపిసోడ్ పోస్టింగ్ టైమ్ వచ్చేసింది! సో… ఈసారి మరో బిగ్ బాస్ బ్యూటీ దివిని వ్యూవర్స్ ముందుకు తీసుకొచ్చింది ఆషూ రెడ్డి. విశేషం ఏమంటే… దాదాపు యాభై నిమిషాల నిడివి ఉన్న ఈ సెకండ్ ఎపిసోడ్.. సూటిగా, సుత్తి లేకుండా చకచకా సాగిపోయింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే దివి తన మెంటాలిటీని చెప్పేసింది. తనే కాదు… తన పక్కన ఉండేవాళ్ళు కూడా సుత్తి కొట్టడం మొదలెడితే, తాను తట్టుకోలేనని, స్ట్రయిట్ పాయింట్ లోకి వచ్చేయమని నిర్మొహమాటంగా చెప్పేస్తానని అనేసింది. నిజం చెప్పాలంటే ఆషూ రెడ్డికి కూడా కావాల్సింది అదే!! లెంగ్తీగా సాగదీసి మాట్లాడటం కాదు, మనసులో మాటను టక టకా చెప్పడమే కావాలి.,అదే అంది ఆషూ రెడ్డి కూడా. దాంతో ‘బిగ్ బాస్’ ముందు… ఆ తర్వాత కెరీర్ గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను దివి తెలియచేసింది.
క్రెడిట్ గోస్ టూ బిగ్ బాస్!
ఎంటెక్ చదివిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్… మోడలింగ్ లోకి ఎలా అడుగుపెట్టింది? ఆ తర్వాత సినిమా అవకాశాలు ఎలా పొందింది? బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తన లైఫ్ స్టైల్ ఎలా మారింది? బిగ్ బాస్ ఫినాలే సమయంలో తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పిన మెగాస్టార్ దాన్ని ఎలా నిలబెట్టుకున్నారు? ‘బంగార్రాజు’లో ఛాన్స్ జస్ట్ ఎలా మిస్ అయిపోయింది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను దివి… ఆషూతో షేర్ చేసుకుంది. బిగ్ బాస్ నుండి బయటకు రాగానే ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా తనను ఎంపిక చేయడం అస్సలు ఊహించలేదని, అదంతా బిగ్ బాస్ గొప్పతనమేనని చెప్పింది దివి. ఆ షో నుండి ఏడు వారాల తర్వాత బయటకు వచ్చిన తాను… ఇప్పటికీ మెంటాలిటీని, పర్సనాలిటీని మార్చుకోలేదని తెలిపింది. కరోనా టైమ్ లో ఖాళీగా ఉన్న తనకు బిగ్ బాస్ షో అనేది గొప్ప ప్లాట్ ఫామ్ ఇచ్చిందని, అందుకు నాగార్జునతో పాటు టోటల్ టీమ్ కు తాను రుణపడి ఉంటానని దివి చెప్పింది.
3 ఎ. ఎం. కాన్సెప్ట్!
‘ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్’ అంటారు. నిజంగా అవసరం వచ్చినప్పుడు మన పక్కన నిలబడే వాడే అసలైన ఫ్రెండ్. అందుకే తాను ‘త్రీ ఎ. ఎం.’ అనే కాన్సెప్ట్ ను ఫాలో అవుతానని, ఆ సమయంలో ఫోన్ చేసినా, ఠక్కున తన కోసం వచ్చే వారే అసలైన ఫ్రెండ్స్ గా భావిస్తానంటూ ఆసక్తికరమైన అంశాలను దివి చెప్పింది. తన స్నేహితుల కోసం తానూ అలానే ఎనీ టైమ్ వెళ్తానని, తానూ అదే ఆశిస్తానని తెలిపింది. ఇదే సమయంలో సోహెల్ కు ఓ ప్రాంక్ కాల్ చేసి, తాను బంజారా హిల్స్ లో ఇబ్బందుల్లో ఉన్నానని, వెంటనే వచ్చి తనకు కాస్తంత సపోర్ట్ గా నిలబడమని కోరింది దివి. మరో ఆలోచన లేకుండా సోహెల్ వెంటనే వస్తానని చెప్పడంతో ఆమె అంటే అతనికి ఎంత ప్రత్యేకమో వ్యూవర్స్ కు తేటతెల్లమైంది. అలానే తన కొత్త కమిట్ మెంట్స్ గురించి, ‘పరంపర-2’ వెబ్ సీరిస్ గురించి బోలెడు ముచ్చట్లు చెప్పింది దివి. మెగాస్టార్ తోనూ, సిల్వర్ స్క్రీన్ మన్మథుడు నాగ్ తోనూ తనకున్న స్పెషల్ బాండింగ్ ను మెరిసే కళ్ళతో, ఎరుపెక్కిన బుగ్గలతో దివి చెబుతుంటే… కళ్ళప్పగించి చూడాల్సిందే! మరి ఇంకెందుకు ఆలస్యం… కింద ఉన్న ‘ఫన్ ఫీస్ట్ విత్ ఆషూ రెడ్డి’ ప్రోగ్రామ్ లింక్ ను క్లిక్ చేసి మీరూ చూసేయండి!!