సంక్రాంతి వేళ ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ యూ ట్యూబ్ ఛానెల్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘ఫన్ ఫీస్ట్’. సంక్రాంతి ఫెస్టివల్ ను పురస్కరించుకుని దీన్నిస్ట్రీమింగ్ చేసింది. అందాల భామ, బిగ్ బాస్ ఫేమ్ ఆషూ రెడ్డి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఫస్ట్ గెస్ట్ గా మరో బిగ్ బాస్ ఫేమ్ ‘దేత్తడి’ హరిక హాజరైంది. దాదాపు యాభై నిమిషాల నిడివి వున్న ఈ ‘ఫన్ ఫీస్ట్’ టాక్ షోలో వారి మధ్య ఆసక్తికరమైన అంశాలెన్నో చోటు చేసుకున్నాయి.
ఆషూ రెడ్డి కేవలం తాను అనుకున్న క్వశ్చన్సే కాకుండా ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదురయ్యే పలు ప్రశ్నలనూ ‘దేత్తడి’ హారికపై సంధించింది. వాటికి ఆమె కూడా స్ట్రయిట్ ఫార్వర్డ్ గా ఆన్సర్స్ చెప్పింది. ‘హారిక’, ‘అలేఖ్య హారిక’, ‘దేత్తడి హారిక’ ఇలా రకరకాల పేర్లు ఏర్పడటానికి కారణం… అందులో ఏ పేరంటే తనకిష్టం, ఇన్ని పేర్లు ఉండటం వల్ల కలిగిన ఇబ్బందులు… వీటి గురించిన సమాధానాలు ఆసక్తిని కలిగించాయి. చిత్రం ఏమంటే… యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సంపాదించి, ఆ కారణంగానే బిగ్ బాస్ లో చోటు దక్కించుకున్న ‘దేత్తడి’ హారిక దాదాపు ఆరునెలలుగా దానికి ఎందుకు దూరంగా ఉంటోందో చెప్పిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఇలా ఎంపికై, అలా బయటకు వచ్చేసిన విషయాన్ని ‘దేత్తడి’ హారిక లైట్ తీసుకుంటూ, ‘ఒక రోజు సీ.ఎం.లా నేను ఆ పదవిలో రెండు రోజులు ఉన్నాను’ అంటూ పైకి నవ్వుతూ జవాబిచ్చినా… అలా జరగడం వెనుక, దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా వివాదం సృష్టించిన వ్యక్తుల కారణంగా ఆమె పడిన పెయిన్ ను తెలియచేసింది. ఇక పొట్టిగా ఉన్నావంటూ ట్రోల్ చేసే వారికి ‘దేత్తడి’ హారిక గట్టి జవాబే ఇచ్చింది. ఇదే సమయంలో దీప్తి సునైన తనకు ఎంతో క్లోజ్ ఫ్రెండే అయినా… ఆమె వ్యక్తి జీవితంలోకి తాను తొంగి చూడనని చెబుతూనే, షణ్ముఖ్ – దీప్తి బ్రేకప్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
‘దేత్తడి’ హారిక కు ఉన్న గుర్తింపుకు, ఆమె ప్రతిభకు ఫిదా కాని కుర్రకారే ఉండరు. ఆమెకు ఇప్పటికే ఎంతో మంది ప్రపోజ్ చేసి ఉంటారు. అయితే… లవ్, ఫ్రెండ్ షిప్ విషయంలో తాను చాలా ఛూజీ అని స్పష్టం చేసింది హారిక. మరీ ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్స్ విషయంలో చాలా క్లారిటీతో ఉంటాననీ చెప్పింది. పెళ్ళి వంటి ముచ్చట్లు తనకిష్టం లేదని చెబుతూనే, తను ఎలాంటి వాడిని భర్తగా కోరుకుంటానో చెప్పడం కొసమెరుపు. సో… పెళ్ళి గురించి పాజిటివ్ గా లేకపోయినా… పెళ్ళి కొడుకు లక్షణాలు అమ్మడు చెప్పింది అంటే.. సమ్ థింగ్ ఫిషీ అనే అనుకోవాలి.
బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత ‘దేత్తడి’ హారిక చేసిన అమ్మాడి సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందుకే ఆ తర్వాత తన నెక్ట్స్ టార్గెట్ సిల్వర్ స్క్రీన్ అనుకుంటోంది హారిక. అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందో రివీల్ చేయలేదు కానీ తాను హీరోయిన్ అయితే ముందుగా ఆనంద పడేది తన తల్లే అని చెప్పింది. అంతేకాదు… ఐటమ్ సాంగ్స్ కూ తాను సై అంటానని, డాన్స్ బాగా చేస్తాననే నమ్మకం తనకుందని, యూకేజీ నుండి డాన్స్ చేసే అలవాటు ఉందని చెప్పుకొచ్చింది. ఇలాంటి బొలెడన్ని విషయాల గురించిన ఇన్ ఫర్మేషన్ ను ఆషూరెడ్డి నవ్వుతూ నవ్వుతూనే ‘దేత్తడి’ హారిక నుండి లాగేసింది. సో… ఇంక ఆలస్యమెందుకూ… ఆ ముచ్చట్లను తెలుసుకోవడానికి కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసేయండి. ఈ ‘ఫన్ ఫీస్ట్’ ప్రొగ్రామ్ చూసిన తర్వాత ఆషూ రెడ్డి నెక్ట్స్ ఎవరిని గెస్ట్ గా పిలుస్తుందనే ఆసక్తి కూడా వ్యూవర్స్ లో కలగడం ఖాయం.