అనుమానాస్పద స్థితిలో హాస్యనటుడి మృతి… హోటల్ గదిలో శవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో మంది ముఖాల్లో నవ్వులతో సంతోషాన్ని నింపిన ప్రముఖ అమెరికా హాస్యనటుడు బాబ్ సాగేట్ అనుమానాస్పద మృతి ఆయన అభిమానులను, హాలీవుడ్ ను కలచి వేసింది. స్థానిక షెరీఫ్ ప్రకారం ఈ స్టార్ ఆదివారం రాత్రి మరణించాడు. ఆయన మృతదేహం ఫ్లోరిడాలోని ఒక హోటల్ గదిలో కన్పించింది. 65 ఏళ్ళ వయసున్న ఈ హాస్యనటుడు అనుమానాస్పద మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Read Also : నటిపై అత్యాచారం కేసులో బెదిరింపులు… మళ్ళీ కష్టాల్లో పడ్డ స్టార్ హీరో
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
సమాచారం ప్రకారం.. ఆదివారం నాడు ఫ్లోరిడాలోని ఓర్లాండోలోని రిట్జ్-కార్ల్‌టన్‌లో ఆయన మరణించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆ హోటల్‌లోని ఉద్యోగులు ఆయన గదిలో నుంచి బయటకు రాకపోవడం, స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న షరీఫ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఎలాంటి డ్రగ్స్ లేవని ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ట్వీట్ ద్వారా తెలియజేశారు.
Read Also : హృతిక్ రోషన్ ఇంటెన్స్ లుక్… ‘విక్రమ్ వేద’ ఫస్ట్ లుక్
బాబ్ సాగేట్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన స్టాండ్ కామెడీతో చాలా మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఆయన 1956 మే 17న అమెరికాలోనే జన్మించాడు. స్టాండ్ కామెడీతో పాటు టెలివిజన్ షోలను కూడా హోస్ట్ చేశాడు. 1887 నుండి 1995 వరకు ప్రసారమైన ABC టెలివిజన్ షో ‘ఫుల్ హౌస్’లో డానీ టాన్నర్ పాత్రతో పాపులర్ అయ్యారు. దీని సీక్వెల్ 2016లో ‘ఫుల్లర్ హౌస్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రారంభమైంది. ఆయన ‘అమెరికాస్ ఫన్నీయెస్ట్ హోమ్ వీడియోస్’ షోను కూడా హోస్ట్ చేశాడు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!