Site icon NTV Telugu

Tollywood : 15 రోజుల గ్యాప్ లు రెండు సినిమాలు దించుతున్న ప్లాప్ బ్యూటీ

Bagyasri

Bagyasri

మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఫస్ట్ అప్పీరియన్స్‌తోనే అందాల ఆరబోతతో ఆడియన్స్ మనస్సు దోచేసింది. టాలీవుడ్ యూత్ క్రష్‌గా అవతరించింది. ఈ గ్లామరస్ డాల్‌కు తెలుగులో తిరుగులేదు అనుకుంటే ప్లాపులు ఆమె క్రేజుకు బ్రేకులేస్తున్నాయి. బచ్చన్‌తో జిక్కిగా మెస్మరైజ్ చేసిన భాగ్యశ్రీ ప్రమోషన్లను తెగ హడావుడి చేసిందికాని సినిమా ఏమి లాభం సినిమా డిజాస్టర్ కావడంతో శ్రమ వృథా అయ్యింది.

Also Read : Raghava Lawrence : భారీ ధర పలికిన కాంచన 4 రైట్స్

బచ్చన్ రిజల్ట్ అలా ఉంటే విజయ్ దేవరకొండ కింగ్డమ్‌తో హిట్ కొట్టి పాత లెక్కని సరిచేయాలనుకుంది భాగ్యశ్రీ. ఆ సినిమా కూడా ప్లాప్ అయింది. కింగ్డమ్ లో మంచి రోల్ కూడా పడలేదు. కానీ ప్లాపులున్నా శ్రీలీలలా అమ్మడికి కూడా  ఛాన్సులకు కొదవ లేదు. నెక్ట్స్ రెండు సినిమాలతో అదీ కూడా నవంబర్ బరిలో తన లక్ టెస్టు ఎలా ఉంటుందో తేల్చుకోబోతోంది. నవంబర్ బరిలో భాగ్యశ్రీ బోర్సే నటించిన టూ ఫిల్మ్స్ విత్ ఇన్ 15 డేస్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిలో ముందుగా ఈ నెల14న రిలీజ్ అవుతుంది కాంత. ఈ సినిమాతో తమిళంలో ఇంట్రడ్యూస్ అవుతుంతోంది బ్యూటీ. రానాతో కలిసి హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ మంత్ ఎండింగ్ 28న రామ్ పోతినేనితో కలిసి ఆంధ్రా కింగ్ తాలూక తో పలకరించబోతోంది. ఈ రెండిటీలో ఏ ఒక్క సినిమా హిట్టు కొట్టిన భాగ్యశ్రీకి లక్ భాగ్యం దక్కినట్లే. ఈ సినిమాలు తనకు బ్రేక్ ఇస్తాయని ధీమాగా ఉంది. మరి ఈ హాట్ సోయగాన్ని రామ్ అందుకుంటాడో లేక దుల్కర్ దయతలుస్తాడో చూడాలి.

Exit mobile version