Dhanush : క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ కుబేర. కింగ్ నాగార్జున, ధనుష్ కాంబోలో ఇది రాబోతోంది. ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. సోషియో ఫాంటసీగా ఇది రాబోతోంది. బిచ్చగాడిగా ఉండే ధనుష్.. అలా ఎందుకు మారిపోయాడు అనేది ఆసక్తికరంగా ఇందులో చూపించబోతున్నారంట. ముంబైలోని ఓ ప్రాంతంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున ఈడీ అధికారికగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. జూన్ 20న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. అయితే తాజాగా మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ మరొకటి వచ్చింది.
Read Also : Lady Aghori: యో* పూజ చేస్తానని మోసం… లేడి ప్రొడ్యూసర్ కి 10 లక్షల టోకరా..
ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ను ఏప్రిల్ 20న రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ ఓ పండగ వద్ద మాస్ డ్యాన్స్ వేస్తున్నట్టు పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇందులో ఆయన విజిల్ వేస్తూ చేసిన మాస్ డ్యాన్స్ అదుర్స్ అనేలా ఈ పోస్టర్ ఉంది. ఇప్పటి వరకు ధనుష్ స్టిల్స్ ఈ సినిమా నుంచి ఇలా రాలేదు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని పోస్టర్లలో ఆయన బెగ్గర్ గానే కనిపించాడు. ఫస్ట్ టైమ్ ఆయన పాష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఏప్రిల్ 20న తమిళ కొత్త సంవత్సరం వస్తోంది కాబట్టి ఆ రోజు ఈ పాటను రిలీజ్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో మనకు తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.