First Day First Show Song Launch By Allu Aravind :’జాతిరత్నాలు’ సినిమా తెరకెక్కించిన అనుదీప్ కేవీ మిత్ర బృందానికి చాలా కళలున్నాయి. అనుదీప్ ఇచ్చిన కథను బేస్ చేసుకుని వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ దర్శకులుగా ఏడిద నాగేశ్వరరావు మనవరాలు, ఏడిద శ్రీరామ్ కుమార్తె శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ మూవీ కోసం ఇంకా చిత్రీకరించిన ఓ పాటను ఈ చిత్ర బృందం తెలివిగా అల్లు అరవింద్ తో లాంచ్ చేయించేసింది. గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్ళిన ఈ సినిమా బృందం…. మూవీ మేకింగ్ కు సంబంధించిన విశేషాలను, బడ్జెట్ ను అల్లు అరవింద్ కు చెప్పి, ఆయన కంపెనీతో టైఅప్ చేసుకుని సినిమాను విడుదల చేస్తామంటూ ఆయనకే ఓ ఆఫర్ ఇచ్చింది. వీళ్ళ వాలకం చూసి కంగారు పడిన అల్లు అరవింద్, ఈ సినీ రత్నాలు అసలు సినిమా ఎలా తీసి ఉంటారో అనే సందేహానికి గురయ్యారు.
ఇదే సందేహాన్ని చిత్ర నిర్మాత శ్రీజ దగ్గర వ్యక్తం చేశారు అరవింద్. ఈ మొత్తం ఎపిసోడ్ ను కామెడీగా చిత్రీకరించి, మూవీ ప్రమోషన్స్ కు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు, తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, సీవీఎల్ నరసింహారావు, ప్రభాస్ శ్రీను, మహేశ్ ఆచంట తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ షూటింగ్ నారాయణ ఖేడ్ లో జరిగింది. చూస్తుంటే…. ‘జాతిరత్నాలు’ తరహాలో ఇది కూడా ఏదో స్థాయిలో మంచి విజయాన్ని అందుకునేలానే ఉంది.