Kamal Kishore Misra: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యను కారుతో తొక్కించి కడతేర్చాడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాలీవుడ్ లో సంచలనం రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కమల్ కిషోర్ మిశ్రా బాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. అతనికి భార్య యాస్మిన్ , పిల్లలు ఉన్నారు. అయితే గత కొన్నిరోజులుగా కమల్ వేరొక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 10 న అంధేరిలోను ఒక ఇంటి పార్కింగ్ స్థలంలో కారులో ఆ యువతితో సరసాలు ఆడుతూ భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.
ఇక భార్య చూడడంతో వేగంగా కారు పోనివ్వడానికి ప్రయత్నించాడు. భార్య కారును ఆపడానికి ప్రయత్నిస్తూ కారు టైర్ కింద పడిపోయింది. అయినా కమల్ మాత్రం కారు ఆపకుండా ఆమె కాళ్ళ మీద నుంచి కారును పోనిచ్చి పరారయ్యాడు. ఇక అంబోలిని వెంటనే అక్కడ ఉన్నవారు ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. ఇక ఈ ఘటనపైయాస్మిన్ అంబోలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని తనను చంపడానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Mumbai: FIR registered against filmmaker Kamal Kishor Mishra for allegedly ramming his car into his wife after she spotted him with another woman in the vehicle, say police pic.twitter.com/DeUa1YP1Xu
— AH Siddiqui (@anwar0262) October 26, 2022