Brahmastra: బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్.. రూ.10 కోట్లు తీసుకున్న రాజమౌళి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmastra: దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా అనుకున్నాడంటే దాన్ని సక్సెస్ చేయక మానడు. అది సినిమా అయినా, ప్రమోషన్స్ అయినా.. ఇటీవలే జక్కన్న బ్రహ్మాస్త్ర తెలుగు ప్రమోషన్స్ ను తన భుజస్కంధాలపై వేసుకున్న విషయం విదితమే. ఈ సినిమా మరీ భారీ విజయాన్ని అందుకోక పోయినా ఒక మోస్తరు విజయాన్ని అయితే చేజిక్కించుకొంది. గుడ్డిలో మెల్ల అన్నట్లు బాలీవుడ్ లో ఇప్పుడు ఇదే పెద్ద సక్సెస్. ఆ విజయానికి కారణం ఒక విధంగా రాజమౌళి అని చెప్పొచ్చు. తన ప్రమోషన్స్ స్ట్రాటజీని ఈ సినిమాకు కూడా అప్లై చేశాడు. అయితే ఈ ప్రమోషన్స్ ను జక్కన్న ఊరికే చేయలేదాని, ఇందుకోసం బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్, రాజమౌళికి రూ. 10 కోట్లు ముట్టజెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక తాజాగా ఈ వార్తలపై ధర్మ ప్రొడక్షన్స్ సన్నహితులు స్పందించారు. ఇవన్నీ పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. కరణ్ జోహార్, బాహుబలిని హిందీలో డిస్ట్రిబ్యూట్ చేశారు. అందుకు సాయంగా జక్కన్న ఈ పనికి ఒప్పుకున్నారు. అంతేతప్ప ఈ పని చేయడానికి ఆయన ఒక్క రూపాయి ని కూడా ఆశించలేదని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయాన్ని రాజమౌళి ప్రమోషన్స్ లో ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. కథ నచ్చి మాత్రమే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాను.. నా సినిమాలకు, కరణ్ సినిమాలకు చాలా తేడా ఉంది. బాహుబలి కి కరణ్ ఎంతో హెల్ప్ చేశాడు. దానివలనే ఈ సినిమాకు నేను హెల్ప్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది.
Also Read
- Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..