Umair Sandhu: చిరంజీవిని అంకుల్ అన్న ప్రముఖ క్రిటిక్.. మెగా అభిమానుల ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Umair Sandhu: ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉమైర్ సంధు సెంట్రల్ సెన్సార్ బోర్డులో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఏదైనా క్రేజీ మూవీ విడుదల అవుతుందంటే చాలు కొన్ని రోజుల ముందుగానే ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో రివ్యూ పోస్ట్ చేస్తుంటాడు. అంతేకాకుండా వివాదాస్పద కామెంట్లు కూడా చేస్తాడు. దీంతో అతడికి, కొందరు హీరోల అభిమానులకు సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. తాజాగా ఉమైర్ సంధు మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఓ కామెంట్ పెట్టాడు. చిరంజీవి అంకుల్ అంటూ ట్రోల్ చేశాడు. ‘చిరంజీవి అంకుల్, ఇంకా యంగ్‌గా కనిపించలానే ప్రయత్నాన్ని మానుకోండి. ఇప్పుడు మీ వయసు 70 ఏళ్లు అని గుర్తుంచుకోండి’ అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు.
Read Also: Bigg Boss Adi Reddy: ఆది రెడ్డి ఇంత పారితోషికం తీసుకున్నాడా?
Also Read
ఈ నేపథ్యంలో ఉమైర్ సంధుపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. అతడు ఎప్పుడు చూసినా క్రేజ్ ఉన్న వ్యక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్రేజ్ పొందాలని చూస్తుంటాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిల్లర కామెంట్స్ చేస్తే చిప్పకూడు తప్పదని మెగా ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉమైర్ సంధు పద్ధతి మార్చుకోకపోతే తాము వేరే విధంగా బుద్ధి చెప్తామని కామెంట్ చేస్తున్నారు. కాగా చిరంజీవిని ఉమైర్ సంధు టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు.‘గాడ్ ఫాదర్ సినిమా ఓ యావరేజ్ మూవీ అని… కొత్త సీసాలో పాత సారా అనేలా ఉందని విమర్శించాడు. చిరంజీవి దయచేసి రెస్ట్ తీసుకోవాలని.. ఇకనైనా మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకోవాలని ఉమైర్ సంధు సూచించాడు.
Uncle #Chiranjeevi stop trying to be young! You are 70 🙈😃
— Umair Sandhu (@UmairSandu) December 18, 2022
తాజావార్తలు
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
-
Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్‌ప్లే
-
Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!