Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Ramana Gogula Interview For Sankranthiki Vastunnam Movie

Ramana Gogula: వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయా.. కానీ ఈ పాట నేనే పాడాలి అనిపించింది!

Published Date :December 17, 2024 , 6:28 pm
By Bhargav Chaganti
Ramana Gogula: వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయా..  కానీ ఈ పాట నేనే పాడాలి అనిపించింది!
  • Follow Us :
  • google news
  • dailyhunt

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నామ్’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గోదారి గట్టు సాంగ్ 27 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. రమణ గోగుల పాడిన ఈ పాట సోషల్ మీడియాతో పాటు అన్నీ మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ వైరల్ గా మారింది. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సింగర్ రమణ గోగుల విలేకరుల సమవేశంలో ‘సంక్రాంతికి వస్తున్నామ్’ విశేషాల్ని పంచుకున్నారు.

గోదారి గట్టు ఆల్రెడీ 27 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది ?
-చాలా గ్రేట్ ఫుల్ గా ఉంది. నా పాటని అభిమానించే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మళ్లీ నేనెప్పుడూ పాడుతానా అని ఎదురు చూశారు. నేను నా వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయాను. యూఎస్ లో ఉన్నాను. నేను ఎవరి సంగీతంలో ఇప్పటివరకు పాడలేదు. కానీ అనిల్, బీమ్స్ చాలా లవింగ్ పర్సన్స్. ఫెంటాస్టిక్ యాటిట్యూడ్ తో ఉంటారు. వెంకటేష్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్. నా తొలి సినిమా వెంకటేష్ గారి ప్రేమంటే ఇదేరా. ఇలాంటి మంచి కాంబినేషన్లో వస్తున్న ఈ పాటని పాడాలని అనుకున్నాను. బీమ్స్ లవ్లీ గా కంపోజ్ చేశారు. పాటకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందం ఇచ్చింది. లైఫ్ ఫుల్ సర్కిల్ అయిందనే ఫీలింగ్ వచ్చింది

ఈ పాట మీ వద్దకు ఎలా వచ్చింది?
-నేను యూస్ లో ఉన్నాను. బీమ్స్ కాల్ చేసి తప్పకుండా ఈ సినిమాలో పాట పాడాలని కోరారు. సాంగ్ పంపించమని అడిగాను. పాట ఒక రెండు సార్లు విన్నాను. చాలా నచ్చింది. పాటలో ఒక హార్ట్ ఉంది. డెఫినెట్ గా పాడాలి అనిపించింది. అలా ఈ పాట పాడాను. ఈ పాట పాడటానికి చాలా క్రియేటివ్ ఫ్రీడం దొరికింది.

-మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. నా వాయిస్ కి వాయిస్ కి పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయింది. భాస్కర భట్ల గారు పెంటాస్టిక్ గా రాశారు.

-ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందం ఇచ్చింది. ఓ వ్యక్తి ఫోన్ చేసి మా ఊర్లో పొద్దున లేస్తే ఇదే పాట వేస్తున్నారు అందరూ డాన్స్ చేస్తున్నారని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వాయిస్ లోఅదే మ్యాజిక్ ఉందని ఆడియన్స్ చెప్పడం చాలా హ్యాపీనెస్ నిచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నామ్’ గ్రేట్ ఫిల్మ్. అనిల్ అద్భుతంగా తీశారు. సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది.

వెంకటేష్ గారి రెస్పాన్స్ ఎలా ఉంది?
-వెంకటేష్ గారు కాల్ చేశారు. నేను మళ్లీ పాట పాడడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఆయనకి పాట చాలా నచ్చింది. ఆయనలో అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు లేదు. అదే మ్యాజిక్ ఉంది. ఆయన రాక్ స్టార్.

-ఇండస్ట్రీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి. అందరూ అభినందించారు.

మళ్లీ మీరు ఎప్పుడు కంపోజ్ చేయబోతున్నారు?
-నేను సిద్ధంగా ఉన్నాను. అయితే అన్నీ కుదరాలి. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చాలా అద్భుతంగా సంగీతం చేస్తున్నారు. పాటలు ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. అయినా ఒక న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కడో చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా దగ్గర కొన్ని వినూత్నమైన ఐడియాలు వున్నాయి. యాక్టర్, స్టొరీ, డైరెక్టర్ సరైన సమయంలో పర్ఫెక్ట్ గా కుదరాలి. తప్పకుండా నా నుంచి మ్యూజిక్ ని ఆడియన్స్ ఆశించవచ్చు.

గ్యాప్ రావడానికి కారణం ఏంటి?
-నేను అబ్రాడ్ లో మల్టీ నేషనల్ కంపెనీస్ కి వర్క్ చేశాను, నాకు టెక్నాలజీ చాలా ఇష్టం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా ఎనలిటిక్స్ ప్రాజెక్ట్స్ లో చేశాను.

అప్పటికి ఇప్పటికీ మ్యూజిక్ టెక్నాలజీ లో ఎలాంటి మార్పులు వచ్చాయి?
-చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా అసలు ఒక సింగర్ పాట పాడాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా సాంగ్ వస్తుంది. అయితే ఒక పాటకి హార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అది హ్యూమన్ టచ్ తోనే సాధ్యమవుతుంది.

పవన్ కళ్యాణ్ గారితో మీది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కదా.. ఆయనతో వర్కింగ్ ఎలా ఉండేది?
-పవన్ కళ్యాణ్ గారు క్రియేటివ్ పర్సన్. చాలా కొత్తగా ప్రయత్నిస్తారు. ఫస్ట్ టైం తెలుగు సినిమాల్లో ఇంగ్లీష్ పాట ఆయన సినిమా కోసమే కంపోజ్ చేయడం జరిగింది. ఆయన విన్న వెంటనే ఈ పాట చేస్తున్నామని కాన్ఫిడెంట్ గా చెప్పారు. అది ఒక మ్యాజిక్ లో జరిగింది. ఇప్పుడు ఆయన చాలా గొప్ప స్థాయిలో వుండటం చాలా ఆనందంగా వుంది.

మీరు పాడిన పాటల్లో మీకు ఇష్టమైన సాంగ్?
-నాకు ఇష్టం లేకపోతే కంపోజ్ చేయను. నాకు అన్ని ఇష్టమే. ఒక్కటి చెప్పాలంటే యువరాజు సినిమాలో మనసేమో చెప్పిన మాటే వినదు పాట నాకు చాలా ఇష్టం. అది గ్రేట్ కాంపోజిషన్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ramana Gogula Interview
  • Sankranthiki Vastunnam
  • Sankranthiki Vastunnam Movie

తాజావార్తలు

  • Gold Rates: మార్కెట్లు పతనం వేళ మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

  • Ugadi 2026: చైత్రం నుంచి ఫాల్గుణం వరకు.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వ్యాపార గృహప్రవేశాలకు శుభ ముహూర్తాలివే!

  • PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ

  • JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..

  • Pre Wedding Shoot: ముదురుతున్న పిచ్చి.. ఫ్రీ-వెడ్డింగ్ షూటింగ్ కోసం ఓ జంట ఎంత పని చేసిందంటే..!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions