సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌తో మాటల మాంత్రికుడు చేస్తున్న సినిమా ఇదే. వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా… సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. స్టార్టింగ్‌లో గుంటూరు కారం సినిమాకు చాలా బ్రేకులే పడ్డాయి. అందుకే.. ఇప్పుడు నాన్ స్టాప్ షెడ్యూల్స్‌తో దూసుకుపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను జనవరి 13న గుంటూరు కారం రిలీజ్ చేయాల్సిందేనని మహేష్ ఫిక్స్ అయిపోయాడు. ఆ తర్వాత వెంటనే రాజమౌళి ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇక జక్కన్న సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక్కసారి రాజమౌళితో చేతులు కలిపితే ఏ హీరో అయినా సరే రెండు, మూడేళ్లు ట్రావెల్ చేయాల్సిందే. నెక్స్ట్ మహేష్ కూడా అదే చేయబోతున్నాడు.
ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 స్క్రిప్టు వర్క్ జరుగుతోంది కానీ అప్పుడే రంగంలోకి దిగిపోయాడు మహేష్ బాబు. మామూలుగానే జిమ్‌లో చెమటలు చిందించే మహేష్… ఇప్పుడు ఇంకాస్త ఎక్కువగా కష్టపడుతున్నాడు. ఇదే విషయాన్ని మహేష్‌ను అడిగితే… ఈ వర్కౌట్లు రాజమౌళి సినిమా కోసం కాదు.. దాని కోసం స్టార్ట్ చేసినప్పుడు చెప్తానని అంటున్నాడు. రీసెంట్‌గా మహేష్ షేర్ చేసిన వర్కౌట్ ఫోటో చూస్తే… ఖచ్చితంగా రాజమౌళి సినిమా కోసమేనని చెప్పొచ్చు. ఎందుకంటే మహేష్ బాబు సినిమా రాక్షసుడు, వందేళ్లు వచ్చే వరకు సినిమాలు మాత్రమే చేస్తానని అంటూ ఉంటాడు. రీసెంట్‌గా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఎన్టీవికి ఇచ్చిన ఇంటర్యూలో కూడా… మహేష్ బాబు సినిమా రాక్షసుడు… మాగ్జిమమ్ పది టేకులు తీసుకుంటే గానీ సాటిస్ఫై అవ్వడు అని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన పని రాక్షసుడు రాజమౌళితో సినిమా రాక్షసుడు మహేష్ బాబు కలిస్తే.. రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.