మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర పార్ట్ 1”.. ఈ మూవీని యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో నటించనున్నాడు.. ఈ సినిమాతో మరో సారి ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించనున్నాడు.. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోలో అనిరుధ్ బీజీఎం అదిరిపోయింది.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. అయితే ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5 న విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల దేవర సినిమా అక్టోబర్ 10 కి వాయిదా పడింది..
దేవర లేట్ గా వచ్చినా కూడా ప్రతి ఒక్క అభిమాని కాలర్ ఎత్తుకునేలా దేవర సినిమా ఉండనుందని ఎన్టీఆర్ తెలిపారు.. దేవర సినిమాను భారీ బడ్జెట్ తో యువసుధ క్రియేషన్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..దేవర సినిమా కోసం దర్శకుడు కొరటాల ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నారు.. ఈ సారి ఎలాంటి మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్ యాక్షన్ సినిమాను ప్రేక్షకులకు అందించాలని కొరటాల భావిస్తున్నాడు.. ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవర సినిమాపై ఇప్పటికే అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి.ఇదిలా ఉంటే దేవర థియేట్రికల్ రైట్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వంటి నిర్మాణ సంస్థలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.. అయితే ఈ పోటీలో చివరికి సితార ఎంటర్టైన్మెంట్స్ రికార్డ్ ధరకు దక్కించుకోనున్నట్లు తెలుస్తుంది.