Box Office Records: పుష్ప టూ రామాయణ.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వేగంగా చేరిన 8 సినిమాలు ఇవే..

  • అత్యంత వేగంగా రూ. 1000 క్లబ్‌లో చేరిన 8 సినిమాలు..
  • పుష్ప నుంచి ధురంధర్ వరకు తెలుగు, హిందీ సినిమాలదే హవా..
Box Office Records

Box Office Records

Box Office Records: ఇండియన్ మూవీ రికార్డుల్ని ‘‘రామాయణ’’ తిరగరాస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 1000 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లో చేరింది. ఈ మార్కును చేరుకున్న సినిమాల్లో హిందీ, తెలుగు ఇండస్ట్రీల హవా కనిపిస్తోంది. అత్యంత వేగంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టిన సినిమా జాబితాను పరిశీలిస్తే 8 సినిమాలు ఈ రికార్డు కలిగి ఉన్నాయి. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల వసూళ్లను దాటాయి. ఈ రెండు సినిమాలు ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాయి. బాలీవుడ్‌లో అత్యంత వేగంగా రూ. 1000 కోట్ల మార్కును అందుకున్న సినిమాగా ధురంధర్-2 మొదటిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో రామాయణ నిలిచింది.

1) పుష్ప: ది రూల్

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా 2024లో విడుదలై కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కును చేరుకుంది. ఈ సినిమా మొత్తంగా రూ. 1742 కోట్లు వసూలు చేసింది.

2) ధురంధర్ 2: ది రివెంజ్

2026లో వచ్చిన రణ్‌వీర్ సింగ్ ధురంధర్ 2 కూడా 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లను వసూలు చేసింది. పుష్ప-2 రికార్డును సమం చేసింది. ఈ సినిమా మొత్తంగా రూ. 1813 కోట్లు వసూలు చేసింది.

3) రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్

రణ్‌బీర్ సింగ్, సాయి పల్లవి నటించిన ‘‘రామాయణ’’, 8 రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈ సినిమా ఈ రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 1033 కోట్లను వసూలు చేసింది.

4) బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017)

2017లో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి -2 పదిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లను వసూలు చేసింది. మొత్తంగా 1788 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

5) ఆర్ఆర్ఆర్

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 1230 కోట్లు వసూలు చేసింది.

6) కేజీఎఫ్: చాప్టర్ 2

కన్నడ స్టార్ యశ్ నటించిన సినిమా కేజీఎఫ్-2 రూ. 1000 కోట్లు సాధించడానికి 18 రోజులు పట్టింది. శాండిల్‌వుడ్ ఇండస్ట్రీ సత్తాను దేశానికి చాటింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 1245 కోట్లను రాబట్టింది.

7) జవాన్

బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లు రాబట్టింది. మొత్తంగా 1160 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది.

8) పఠాన్

2023లో వచ్చని షారూఖ్ మరో చిత్రం పఠాన్ 27 రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది.

రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల్లో అమీర్ ఖాన్ దంగల్, ప్రభాస్ కల్కీ 2898AD కూడా ఉన్నాయి.