Farina Azad Share her Strange Love Proposal: పరినా ఆజాద్ తమిళ సీరియల్ నటిగా మారిన యాంకర్. తాజాగా తన జీవితంలో జరిగిన ఓ చెత్త లవ్ ప్రపోజల్ గురించి షేర్ చేసుకున్నారు. 28 ఏళ్ల ఫరీనా అసద్ 19 ఏళ్ల వయసులో యాంకర్‌గా పని చేయడం ప్రారంభించింది. 2014లో ‘ఒరు మిన్ ప్లీజ్’ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన పరీనా ఆ తర్వాత కోలీవుడ్ అండ్ కట్, కిచెన్ గలాటా, అంజరాయ్ పెట్టి తదితర షోలను హోస్ట్ చేసి ఫేమస్ అయింది. యాంకర్‌గానే కాకుండా సీరియల్స్‌లో కూడా నటించడం ప్రారంభించిన పరినా, మొదటగా సీరియల్‌లో నివేదిత పాత్రను పోషించింది. ఈ సీరియల్‌లో పరినాకు ఆశించిన ఆదరణ లభించకపోవడంతో ఆమె సన్ టీవీ నుండి విజయ్ టీవీకి జంప్ అయ్యింది. ఆ విధంగా 2019 నుంచి 2023 వరకు విజయవంతంగా నడిచిన భారతి కన్నమ్మ సీరియల్‌లో ఆమె నటించింది.
Sunil Chettri: తన చివరి అంతర్జాతీయ గేమ్‌పై ఆసక్తి రేపుతున్న సునీల్ చెత్రీ..
ఈ సీరియల్ ఆమెకు భారీ విజయాన్ని అందించింది. ఈ సీరియల్‌లో పరీనాకు నెగెటివ్ రోల్ ఉన్నప్పటికీ, ఆమె తన ప్రతిభతో అభిమానులను ఆకట్టుకుంది. అలా పరీనా 2017లో రెహమాన్ ఉబైద్‌ను వివాహం చేసుకోగా, వారికి 2022లో అందమైన మగబిడ్డ జన్మించాడు. ఆమె తన బిడ్డ కడుపులో ఉండగానే తన బొడ్డును చూపించి ఫోటోషూట్ చేసి షేర్ చేయగా విమర్శలను ఎదుర్కోవాల్సి వచింది. ఇక ప్రస్తుతం ‘కుక్ విత్ కోమలి’ షోలో పాల్గొంటున్న పరీనా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు వచ్చిన విచిత్రమైన లవ్ ప్రపోజల్ గురించి పంచుకుంది. అదేంటంటే.. ఓ అబ్బాయి పరీనాను నిత్యం ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతుంటే అతడిని తప్పించేందుకు.. తన ఇంట్లో ముస్లిం అబ్బాయి కాకపోతే ఒప్పుకోరని పరీనా అబద్ధం చెప్పింది. వెంటనే ఆ అబ్బాయి ఆసుపత్రికి వెళ్లి ముస్లిం పురుషులు చేయించుకునే సున్తీ చేయించుకోవడానికి సిద్ధం అయ్యాడట. ఈ ప్రేమ ప్రతిపాదనను తాను ఎప్పటికీ మరచిపోలేనని ఆమె చెప్పింది.