Site icon NTV Telugu

HHVM : సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా.. భారీగా పోలీసుల మోహరింపు..

Hhvm

Hhvm

HHVM : పవన్ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. నైజాం ఏరియాలో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఈ షోలు పడుతున్నాయి. సినిమాలకు ఫేమస్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. థియేటర్ ముందు హంగామా నెలకొంది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పుష్ప-2 ఘటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి అనుమతిస్తున్నారు. థియేటర్ లోపల కూడా పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రీమియర్స్ షో అయిపోయే దాకా థియేటర్ చుట్టుపక్కల జనాలు గుమిగూడకుండా అందరినీ పంపించేస్తున్నారు.

Read Also : HHVM : అతను నా భయాన్ని పోగొట్టాడు.. పవన్ కామెంట్స్..

అయితే సినిమా అయిపోయాక థియేటర్ ముందు డ్యాన్స్ చేసేందుకు, ర్యాలీలు తీసేందుకు అభిమానులు ప్రయత్నించే అవకాశాలు ఉండటంతో.. పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. అలాంటి వాటికి పర్మిషన్ లేదని ముందే తేల్చి చెబుతున్నారు. ఎవరైనా దురుసగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీని నైజాంతో పాటు ఏపీలోని చాలా ఏరియాల్లో ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. ఏపీలో 90 శాతం థియేటర్లలో ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కోసం భారీగా టికెట్ రేట్లను పెంచేశారు. కొన్ని చోట రూ.1000 నుంచి రూ.1500 వరకు ఒక్కో టికెట్ ను అమ్ముతున్నారు.

Read Also : HHVM : గురువు సత్యానంద్ కు పాదాభివందనం చేసిన పవన్..

Exit mobile version