RC 16: టెంపర్ తర్వాత ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన సినిమా హిట్ అవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బుచ్చిబాబుతో #RC16 అనౌన్స్ చేయగానే సోషల్ మీడియాలో మెగా నందమూరి అభిమానులు మధ్య కొత్త చర్చ మొదలయ్యింది. తారక్ అభిమానులు ‘టెంపర్’ తర్వాత ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు అంటుంటే, దీనికి ఉదాహరణగా ‘లై’, ‘లైగర్’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, సినిమాల పేర్లు చెప్తున్నారు. నిజానికి నందమూరి అభిమానులు చెప్తున్నట్లు టెంపర్ మూవీ వరకూ ఒకలా ఉన్న ఎన్టీఆర్ గ్రాఫ్ టెంపర్ తర్వాత పూర్తిగా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్న తారక్ డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. తన కథలని జాగ్రత్తగా ఎంచుకుంటున్న తారక్, ఈమధ్య కాలంలో రిజక్ట్ చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు అనే మాట నిజమే. అయితే బుచ్చిబాబు కథని ఎన్టీఆర్ రిజక్ట్ చేయలేదు, తనకి నచ్చింది చేస్తానని కమిట్ కూడా అయ్యాడు కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు. దీంతో ఆ కథ ఎన్టీఆర్ నుంచి చరణ్ కి షిఫ్ట్ అయ్యింది.
ఇండస్ట్రీలో ఇలాంటివి మాములే కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్ చరణ్ మంచి ఫ్రెండ్స్ కాబట్టి బుచ్చిబాబు సినిమాని చరణ్ టేకప్ చేసే టైంలో ఎన్టీఆర్ తో మాట్లాడాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫాన్స్ చెప్తున్న ‘టెంపర్ తర్వాత ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు’ అనే మాటకి ‘ఫర్ ఏ చేంజ్ ఈసారి ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన చేసిన సినిమా పాన్ ఇండియా హిట్ అవుతుందంటూ’ కౌంటర్ వేస్తున్నారు. అయితే ఇక్కడ ఇద్దరు హీరోల అభిమానులు గమనించాల్సిన విషయం ఏంటంటే అటు చరణ్ దగ్గర కానీ ఇటు ఎన్టీఆర్ దగ్గర కానీ బుచ్చిబాబు కథ మాత్రం రిజక్ట్ అవ్వలేదు. ఇద్దరు హీరోలూ ఒప్పుకున్నారు అంటే అందులో ఎంతో విషయం ఉండి ఉంటుంది. సో ఆ కథలో ఏ హీరో చేసినా అది హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆగస్టు 29 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!