Faima Crucial Comments on Praveen After Break Up: పటాస్ ఫైమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పటాస్ అనే షోకి కాలేజీ నుంచి స్టూడెంట్ గా వచ్చిన ఆమె తనలో ఉన్న టాలెంట్ తో ఏకంగా పటాస్ కంటెస్టెంట్ గా మారి చాలా కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఆమె టాలెంట్ గుర్తించిన మల్లెమాల సంస్థ జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్రోగ్రామ్స్ లో కూడా ఆమెకు అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. ఆ మధ్య తన తోటి పటాస్ కంటెస్టెంట్ ప్రవీణ్ తో ఆమె ప్రేమలో ఉన్నట్టుగా కొన్ని వీడియోలు పెట్టింది. అప్పట్లో కలిసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
Jyothika : సోషల్ మీడియాపై జ్యోతిక కీలక వ్యాఖ్యలు.. అంతా నా కూతురే అంటూ!
అయితే ఈ భామ బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కువగా ప్రవీణ్ తో కనిపించలేదు. దీంతో వీరిద్దరి బ్రేకప్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె ఎన్టీవీ కి ప్రత్యేకంగా ఒక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన బ్రేకప్ గురించి కూడా కొన్ని కీలక విషయాలు బయట పెట్టింది. ప్రేమను పెంచుకున్న తర్వాత చిన్న డిస్టర్బెన్స్ వచ్చి తాము దూరమయ్యామని ఆమె చెప్పుకొచ్చింది. ఆ దూరమైన తర్వాత మళ్ళీ కలిశామని ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటున్నామని అన్నారు. అయితే మళ్లీ కలుస్తారా అని అడిగితే ఇప్పుడు మేము స్నేహితులమా? ప్రేమికులమా? అని అడిగితే నేను చెప్పలేను.
ఎందుకంటే మీరు మమ్మల్ని కన్ఫ్యూషన్ లో పడేస్తున్నారు. ఇప్పుడు స్నేహితులం అంటే ప్రేమ అనేది మోసమేమో అంటారు. లేదు ప్రేమ అంటే మరి ఎందుకు కొన్నాళ్లు విడిపోయారు అని అడుగుతారు. మేము హ్యాపీగా ఉన్నాం మా రిలేషన్ ఏంటనేది మాకు క్లారిటీ ఉంది. దయచేసి మీరు ఈ విషయంలో మాత్రం ఎక్కువ ఆలోచించి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అంటూ ఆమె కామెంట్ చేసింది. అతని వైపు ఎవరూ లేరు అని అతని మీద అందరూ ప్రేమ పెంచేసుకున్నారు. దానివల్ల అందరూ నన్ను తిడుతున్నారు కానీ నిజంగా ప్రేమ ఉంటే పర్సనల్ విషయాలు బయటపెట్టరు కదా అంటూ ఆమె కామెంట్ చేసింది. కెమెరా ముందు కొన్ని విషయాలు చెప్పేస్తే ఇబ్బందికర పరిస్తితులు వస్తాయని, కెమెరా ముందు చెప్పేవి కొన్ని ఉంటాయి చెప్పలేనివి కొన్ని ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది.