విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 27 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వెంత్ ను నేడు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు అతిధులుగా హాజరుకానున్నారు.
మొట్టమొదటిసారి సునీల్ స్టేజీపై ఒక మూకీ షో చేస్తున్నాడు.. సినిమా గురించి ఎవరెవరు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారో సైగలు చేస్తూ చెబుతూ నవ్విస్తున్నాడు.
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ను ఫన్నీ ఇంట్రడక్షన్ ఇచ్చి వేదికపైకి పిలిచింది సుమ. ఎంతో యాక్టివ్ గా స్టేజి పైకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ " మా డాడీ మూవీ మొఘల్ రామానాయుడు తరువాత మనస్ఫూర్తిగా మూవీ మొఘల్ అని పిలవగల వ్యక్తి దిల్ రాజు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి బాధలు ఉన్నాయి. అలాంటి బాధలను మర్చిపోయి అందరూ ఎంతో ఆనందంగా నవ్వుకొనే సినిమా ఇది. 100% నిజమైన అవసరమైన సినిమా ఇది" అని చెప్పుకొచ్చారు.
ఫన్ ఫుల్ గా సాగుతున్న ఈవెంట్ లో సుమ తన పంచ్ లతో నవ్విస్తోంది. తాజాగా ఈ సినిమాలోని లబ్ డబ్ వీడియో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో వరుణ్, వెంకీ లాఠీతో పాటు తమన్నా, మెహ్రీన్ కూడా కనిపించారు.
ఫన్ ఫుల్ గా జరుగుతున్న 'ఎఫ్3' వేడుకలో ఇప్పుడే వెంకటేష్, వరుణ్ తేజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. బ్లాక్ కలర్ డ్రెస్ లో వెంకీ మామ ఎంతో హ్యాండ్ సమ్ గా కనిపించగా గ్రే కలర్ డ్రెస్ లో వరుణ్ లుక్ అదిరిపోయింది. ఇక సినిమాలో రేచీకటి ఉన్నట్లు నటించిన వెంకటేష్ రేచీకటి ఉన్న హీరోలా అలాగే అభిమానుల వద్దకు వెళ్లి పలకరించారు.
సుమ ఫన్ ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. దుబాయ్ నుంచి వచ్చినట్లు ఒంటినిండా నగలతో, పెద్ద సూట్ కేసుతో వచ్చి ఎఫ్3 పెంటాస్టిక్ ఈవెంట్ ను మొదలుపెట్టేసింది. ఇక దుబాయ్ భాషతో నవ్వులు పూయిస్తోంది. వచ్చి రాగానే అందరి చేత నవ్వులు పూయించిన సుమ.. డాన్స్ ప్రోగ్రాంతో ఈవెంట్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం 'ఎఫ్3' లోని లబ్ డబ్ సాంగ్ కు డ్యాన్సర్లు అదరగొడుతున్నారు.
అభిమానులతో శిల్పా కళావేదిక మార్మోగిపోతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ సాంగ్స్ తో సింగర్స్ అభిమానులను హుషారెక్కిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఇప్పటికే వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు చిత్ర బృందం కూడా వేదిక వద్దకు బయలుదేరినట్లు సమాచారం.
https://www.youtube.com/watch?v=ie-1QQ3Tt24