కేవలం హీరో క్యారెక్టర్ పైనే కథలు రాసి హిట్ కొట్టగల ఏకైక దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. ఎన్ని హిట్ సినిమాలని ఇచ్చిన పూరి జగన్నాథ్ సినిమాలని, ఆయన డైలాగ్స్ కోసమే వెళ్లి చూసే ఫాన్స్ ఎంతో మంది ఉన్నారు. పూరి సినిమా వస్తుంది అంటే చాలు, వన్ లైనర్స్ ఎలా రాసాడు అని… పూరి సినిమాలో చేశాడు అంటే చాలు హీరో ఎంత కొత్తగా కనపడుతున్నాడు అనే డిస్కషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, బిజినెస్ మాన్, టెంపర్, శివమణి, బుజ్జిగాడు… ఇలా చెప్పుకుంటూ పోతే పూరి జగన్నాథ్ తెలుగు ఆడియన్స్ ని ఇచ్చిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ బాగానే ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ హిట్ అందుకున్న తర్వాత రౌడీ హీరోతో కలిసి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ చేసిన పూరి… తనపై నమ్మకం పెట్టుకున్న అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో, భారి బడ్జట్ తో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఆశలపై కూడా నీళ్లు చల్లింది.
అమలాపురం నుంచి బాంబే వరకూ లైగర్ సినిమాని కొన్న ప్రతి ఒక్కరు భారీ నష్టాలని ఫేస్ చేశాడు. దీంతో బయ్యర్స్ అందరూ నష్టాలని భర్తీ చెయ్యాలి అంటూ పూరి జగన్నాథ్ పై గొడవకి దిగాడు. పూరి కూడా నష్టాలని భర్తీ చేస్తాను అని మాట ఇచ్చాడు. లైగర్ నుంచి బయటకి వచ్చి కొంచెం గ్యాప్ తీసుకోని తన కొత్త సినిమాని మే 15న పూరి జగన్నాథ్ అనౌన్స్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ, రామ్ పోతినేని పుట్టిన రోజునే ఈ కొత్త సినిమా అనౌన్స్మెంట్ కి ముహూర్తం కూడా సెట్ చేశారు. ఈ విషయం బయటకి రావడంతో “లైగర్ సినిమా బాధితులకి న్యాయం చెయ్యండి” అంటూ ఈరోజు నుంచి ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోషియేషన్ రిలే నిరవధిక దీక్షలకి దిగారు. మరి కొత్త సినిమా అనౌన్స్మెంట్ కి ముందు జరుగుతున్న ఈ ఇష్యూకి పూరి ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది చూడాలి.